దుర్గమ్మా.. నమోస్తుతే..

ABN , First Publish Date - 2022-09-29T05:13:06+05:30 IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో అమ్మవార్లకు బుధవారం ప్రత్యేక అలంకారం చేశారు.

దుర్గమ్మా.. నమోస్తుతే..
క్షీరారామంలో విశాలాక్ష్మీదేవి అలంకారంలో పార్వతీదేవి

శరన్నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక పూజలు


భీమవరం టౌన్‌, సెప్టెంబరు 28: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో అమ్మవార్లకు బుధవారం ప్రత్యేక అలంకారం చేశారు. పలు చోట్ల అమ్మవార్లు గాయత్రిదేవిగా దర్శనమిచ్చారు. శ్రీరాంపురం జగన్మాత శ్రీచ క్రసహిత కనకదుర్గ, పంచారామ క్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో పార్వ తీదేవి, భీమేశ్వరస్వామి ఆలయంలో మహిషాసుర మర్ధిని అమ్మవారు గాయ త్రీదేవిగా దర్శనం ఇచ్చారు. మెంటేవారి తోట బాలాత్రిపుర సుందరిని లలితాదేవిగా అలంకరించి పూజలు చేశారు.


పాలకొల్లు అర్బన్‌: పట్టణంలో పలు ప్రాంతాలు, ఆలయాల్లో శరన్నవ రాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని విశాలాక్షిగా అలంకరించారు. యడ్ల బజారులో కనక దుర్గమ్మవారిని వందలాది మంది భక్తులు దర్శించుకు న్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కంచి కామాక్షీదేవి ఆల యంలో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. చిన్నగోపురం వీధిలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో అమ్మవారిని కాశీ అన్నపూర్ణాదేవిగా అలంక రించారు. దేశాలమ్మ, మావుళ్లమ్మ, ముఖదారమ్మ, మావూరమ్మ తదితరల ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.


పెంటపాడు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దర్శిపర్రు పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి మహిళలు కలశాలతో నదీ జలాలలను తీసుకువెళ్ళి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త బసల శ్యాం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా సర్పంచ్‌ కోలా శేషవేణి, ఉప సర్పంచ్‌ కోలా మార్కండేయులు, తదితరులు పాల్గొన్నారు.


తాడేపల్లిగూడెం రూరల్‌: పట్టణంలో బలుసులమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వదుర్గేశ్వరికి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గొర్రెల శ్రీధర్‌ పూజలు చేశారు. అమ్మవారు అన్నపూర్ణగా దర్శనమిచ్చారు. దేవి మహం కాళమ్మను గాయత్రి దేవిగా అలంకరించారు. వీరంపాలెం బాలాత్రిపుర సుందరి పంచాయతన క్షేత్రంలో అమ్మవారు చంద్రఘటాదేవిగా దర్శనమిచ్చారు.

Updated Date - 2022-09-29T05:13:06+05:30 IST