నిర్విరామంగా.. వైద్య సేవలు

ABN , First Publish Date - 2021-05-08T05:32:36+05:30 IST

జిల్లా జ నరల్‌ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ సేవలు అంది స్తున్నారు.

నిర్విరామంగా.. వైద్య సేవలు
జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం వచ్చిన జనం (ఫైల్‌)

 జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో 2036 మందికి చికిత్స

 సిబ్బందికి కరోనా సోకినా తగ్గని సేవలు

నిజామాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా జ నరల్‌ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ సేవలు అంది స్తున్నారు. సెకండ్‌వేవ్‌ మొదలు కాగానే అప్రమత్తమైన అధికారులు ఒక ఏప్రిల్‌ నెలలోనే రెండు వేల మందికి పై గా చికిత్స అందించారు. నిత్యం పదుల సంఖ్యలో చికిత్స కో సం చేరుతున్న టీం వర్క్‌తో పనిచేస్తున్న సిబ్బంది ఒత్తిడిని తట్టుకుని సేవలు అందిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్సీ, ఇతర ప్రజా ప్రతినిధుల సహాయంతో మందులతో పాటు ఆక్సీజ న్‌ కొరత లేకుండా చూస్తు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు భరోసా కల్పిస్తున్నారు. సిబ్బంది కొవిడ్‌ భారిన పడిన వారికి మనో ధైర్యం నింపుతూ సేవలు అందిస్తున్నారు.

జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి మార్చి రెండో వారం నుంచి పెరి గింది. మహారాష్ట్ర సరిహద్దులు ఉండడంతో జిల్లాలో సెకం డ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కవగా ఉంది. అక్కడ నుంచి రాకపో కలు నియంత్రించక పోవడం వల్ల నిత్యం కేసులు పెరిగా యి. మార్చి చివరి వరకు వ్యాప్తి పెరగగా ఏప్రిల్‌ నెలలో వ్యాప్తి ఎక్కువయింది. జిల్లాలోని అన్ని గ్రామాల్లోకి వైరస్‌ వ్యాప్తి చెందడంతో కేసుల సంఖ్య పెరిగింది. కేసుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగింది. 

జిల్లాలో సెకండ్‌వేవ్‌ వల్ల కొవిడ్‌ కేసులు పెరగడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పా టు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. కలె క్టర్‌ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహిం చారు. జిల్లా కేంద్రంలోని పడకల సంఖ్యను 500లకు పెంచారు. బోధన్‌, ఆర్మూర్‌ ఆసుపత్రులలోనూ పడకల సంఖ్యను పెం చారు. ఆక్సిజన్‌ పడకల సంఖ్యను పెంచడం తో పాటు అత్యవసర మందులకు ఇబ్బందులు లేకుండా చేశారు.

జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో గాంధీ ఆసుపత్రి తర్వాత అ త్యధికంగా పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్య సేవలు అందిం చారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి మే ఆరు వరకు ఈ ఆసుపత్రిలో 2036 మందికి వైద్య సేవలు అందించారు. ప్ర స్తుతం 500 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో 120 మందికి పైగా ఐసీయూలో ఉన్నారు. అన్ని బెడ్స్‌కు ఆ క్సీజన్‌ సౌకర్యం కల్పించడం వల్ల చికిత్సకు ఇబ్బందులు ఏ ర్పడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు మించి ఈ ఆసుప త్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌ మొదటి విడత కంటే సెకండ్‌వేవ్‌లో మృతుల శాతం ఎక్కువగా ఉన్న చాలా మంది సమారు 85 శాతంకు పైగా డిచార్జి అయ్యా రు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ దొరక చికిత్స పొందితే సీరియస్‌గా ఉండి వచ్చిన వారే ఎక్కువగా చనిపోయారు. రాష్ట్రంలో కొవిడ్‌ చికిత్సలో సక్సెస్‌ రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఇంత తీవ్రత ఉన్న సమయంలో కూడా రెమ్‌డెసి వీర్‌ కొరత లేకుండా ఆసుపత్రిలో ఏర్పాట్లను చేశారు. ఆక్సీ జన్‌ కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చూస్తుండడం వల్లనే వైద్య సేవలు నిరాటంకంగా అందుతున్నాయి.

ఈ ఆసుపత్రిలో సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేయడం వల్లనే కొవిడ్‌ సేవలు ఇబ్బందులు లేకుండా కొన సాగుతున్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నుంచి నాల్గ వ తరగతి ఉద్యోగుల వరకు కొవిడ్‌ బారిన పడిన మిగతా వారితో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో న ర్సింగ్‌, నాలుగో తరగతి, పారమెడికల్‌, హౌస్‌ సర్జన్స్‌, సీని యర్‌ రెసిడెంట్స్‌ వైద్యలతో దీటుగా సేవలు అందిస్తున్నారు. కొన్ని సమయాల్లో సీనియర్‌ వైద్యులు అందుబాటులో లేకు న్నా సీరియస్‌ కేసులకు సేవలు అందిస్తున్నారు. అందరి సహాయ సహకారాల వల్లనే కొవిడ్‌ వైద్య సేవలు అందిస్తు న్నామని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టరు హరీశ్‌ చంద్ర రెడ్డి, డాక్టర్‌ బాల్‌రాజ్‌లు తెలిపారు. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారు లు అన్ని ఏర్పాట్లు చేసి సహాు సహకారాలు అందించడం వల్ల ఇది సాధ్యం అయ్యిందని తెలిపారు. కొవిడ్‌ వచ్చిన వారు సీరియస్‌ కాక ముందే ఆసుపత్రిలో చేరితే త్వరగా తగ్గుతుందని తెలిపారు.

Updated Date - 2021-05-08T05:32:36+05:30 IST