Advertisement
Advertisement
Abn logo
Advertisement

భగ్గుమంటున్న డీజిల్‌ ధర

చేజర్ల, అక్టోబరు 22: డీజిల్‌ ధర భగ్గుమంది. లీటరు రూ.105 దాటేసింది. డీజిల్‌తో పాటు పెట్రోలు, గ్యాస్‌ ధరలు సామాన్య, మధ్య తర గతి ప్రజలపై పెను ప్రభావం చూపుతున్నాయి. కరోనా నేపథ్యంలో రెండే ళ్లుగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవనమే గగనంగా మారింది. వ్యాపారాలు సన్నగిల్లాయి. ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.  దాంతో ఎక్కువ శాతం మంది సొంత గ్రామాల బాట పట్టి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డీజిల్‌ ధరలూ కూడా విపరీతంగా పెరుగుతుండడంతో వ్యవసాయ వ్యయం కూడా పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం లీటరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 20-30పైసలు పెంచుకుంటూ పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మనకంటే లీటరుపై రూ.10 వరకూ తక్కువగా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తరహాలో మన రాష్ట్రంలోనూ పన్నులు తగ్గిస్తే ప్రజలపై ‘పెట్రో’ భారం తగ్గుతుందని రైతులు, ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement