భోపాల్ :ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ చేసిన మంగళసూత్ర వాణిజ్య ప్రచార చిత్రాన్నిఉపసంహరించుకుంది. మంగళసూత్ర వాణిజ్య ప్రకటనను 24 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అల్టిమేటం జారీ చేశారు. వాణిజ్య ప్రకటనను ఉపసంహరించుకోకుంటే పోలీసు బలగాలను పంపిస్తానని సాక్షాత్తూ హోంశాఖ మంత్రి బెదిరించడంతో ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ దిగివచ్చారు. ‘‘వారసత్వం, సంస్కృతిని డైనమిక్ సంభాషణగా మార్చే సందర్భంలో, మంగళసూత్ర ప్రచారం చేశాం. కాని ఈ ప్రచారం సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని మేం చాలా బాధపడ్డాం. సబ్యసాచి ప్రచార ప్రకటనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’’ అని డిజైనర్ సంస్థ ఇన్స్టాగ్రామ్ కథనంలో రాసింది.
ఈ ప్రమోషనల్ ఫొటోషూట్లో మోడల్స్ మంగళ సూత్రం ధరించి కనిపించారు. కొంత మంది ఒంటరిగా మంగళ సూత్రం ధరించగా, మరికొంత మంది అసభ్యకర రీతుల్లో మంగళ సూత్రం ధరించారు. ఫలితంగా నెటిజన్లు సబ్యసాచిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.దీంతో సబ్యసాచి తన వాణిజ్య ప్రకటనను ఉపసంహరించుకున్నారు.