ఆ థియేట‌ర్‌ని చూడగానే వావ్ అంటారు.. చైర్లు సూపర్ అంటారు.. కానీ ఎంతసేపు కూర్చున్నా ప్రదర్శన చూడలేరు.. కారణం తెలిస్తే షాక‌వుతారు!

ABN , First Publish Date - 2021-10-21T13:46:21+05:30 IST

మ‌నిషి మేథ ఎప్పుడూ కొత్త‌ద‌నాన్ని కోరుకుంటుంది.

ఆ థియేట‌ర్‌ని చూడగానే వావ్ అంటారు.. చైర్లు సూపర్ అంటారు.. కానీ ఎంతసేపు కూర్చున్నా ప్రదర్శన చూడలేరు.. కారణం తెలిస్తే షాక‌వుతారు!

మ‌నిషి మేథ ఎప్పుడూ కొత్త‌ద‌నాన్ని కోరుకుంటుంది. మ‌నిషి పురాతన కాలం నుంచి అనేక అద్భుత‌మైన భవనాలను నిర్మిస్తున్నాడు. వాటిలోని కొన్ని నిర్మాణాలు ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని రహస్యాల‌ను దాచుకున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఈ నిర్మాణానికి సంబంధించిన వివ‌రాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. అదే.. ప్ర‌పంచంలో ఎప్పుడూ ఎవ‌రూ క‌నీవినీ ఎరుగ‌ని ఒక థియేట‌ర్‌. దీనిని ఎడారి మధ్యలో నిర్మించారు. ఈజిప్టులో సినాయ్ ద్వీపకల్పానికి దక్షిణాన ఈ ఎడారి ఉంది. ఈ ప్రత్యేకమైన థియేటర్ పర్వత శ్రేణి  కింది భాగంలో నిర్మించారు. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ థియేటర్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క ప్ర‌ద‌ర్శ‌న‌ కూడా జ‌ర‌గ‌లేదు. 


మ‌రి అలాంట‌ప్పుడు.. ఎడారి మ‌ధ్య‌లో సినిమా థియేటర్ ఎందుకు నిర్మించారో.. ఇప్పటి వరకు ఒక్క ప్ర‌ద‌ర్శ‌న కూడా ఎందుకు నిర్వ‌హించ‌లేదో  తెలిస్తే మీరు తెగ ఆశ్చ‌ర్య‌పోతారు. పైగా ఈ అద్భుత‌మైన థియేట‌ర్‌లో వందలాది కుర్చీలు కూడా క‌నిపిస్తాయి. వందల ఏళ్ల‌ క్రితం నిర్మించిన ఈ  థియేటర్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు ఇది కేవ‌లం  ఒక పర్యాటక కేంద్రంగా మాత్రమే ద‌ర్శ‌న‌మిస్తోంది. ఈ నాటకశాలను ఒక ఫ్రెంచ్ వ్యక్తి నిర్మించాడు. గంజాయి వ్య‌స‌నానికి అల‌వాటు ప‌డిన అత‌ను త‌న ద‌గ్గ‌రున్న డ‌బ్బును వృథా చేయ‌డానికి బ‌దులు.. ఆ మొత్తంతో ఏదోఒక‌టి చేయాల‌నుకున్నాడు. ఒక‌రోజు అతను తన స్నేహితులతోపాటు సినాయ్ ఎడారిలో ప‌ర్య‌టించాడు. ఆ ప్రాంతం అత‌నిని అమితంగా ఆకట్టుకోవ‌డంతో అక్క‌డ‌ ఈ థియేట‌ర్ నిర్మించాల‌నుకున్నాడు. అనుకున్న వెంట‌నే కైరో నుంచి చైర్ల‌ను తెప్పించాడు. జనరేటర్‌ను ఆర్డర్ చేయ‌డంతోపాటు భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశాడు. ఆ ప్రదేశాన్ని అద్భుత‌మైన సినిమా థియేటర్‌గా మార్చాడు. అయితే అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఈ థియేటర్ ఎంత‌మాత్రం నచ్చలేదు. కొంత‌కాలానికి ఎవ‌రో జనరేటర్‌ను ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు ఆ థియేటర్ శిథిలావస్థలో ఉంది. 


 

Updated Date - 2021-10-21T13:46:21+05:30 IST