దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు

ABN , First Publish Date - 2022-01-26T02:39:08+05:30 IST

దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు అని తహసీల్దారు లీలారాణి అన్నారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జాతీ

దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు
సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లను సన్మానిస్తున్న తహసీల్దారు లీలారాణి

గూడూరు, జనవరి 25: దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు అని తహసీల్దారు లీలారాణి అన్నారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఓటును సక్రమంగా వినియోగించుకుని నిజాయితీపరులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలన్నారు. అనంతరం సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లను, నూతనంగా ఓటుహక్కు పొందిన వారిని సత్కరించారు. వ్యాసరచన, ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నా రు. అలాగే స్థానిక టవర్‌క్లాక్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి సీపీఐ, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారికి అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఓటుహ క్కును కల్పించారన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్‌, నాశిన భాస్కర్‌గౌడ్‌, కాలేషా, సీవీఆర్‌ కుమార్‌, రవిరాఘవేంద్ర, విజయ్‌కుమార్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక డీఆర్‌డబ్ల్ల్యూ కళాశాలలో న్యాయవాది అరవ పార్వతయ్య ఓటు విలువపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.


వెంకటగిరిలో...


వెంకటగిరి, జనవరి 25: ప్రజాస్వామ్యంలో పదునైన ఆయుధం ఓటు అని ఎంఈవో వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక వీఆర్‌జేసీ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆ యన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో  ప్రిన్సిపాల్‌ సురేష్‌ కుమార్‌ గిండి, కరస్పాండెంట్‌ విజయ కుమార్‌ గిండి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారి శ్రీహరి, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే విజ్ఞరాజా జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారి బుజ్జయ్య ఆధ్వ ర్యంలో  విద్యార్థులు ఓటుహక్కుపై ప్రతిజ్ఞ చేశారు. ఓటర్ల లో చైతన్యం కోసం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.  ఎంపీడీవో కార్యాలయంలో కూడా జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంఈవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.



రాపూరులో...


రాపూరు, జనవరి 25: రాపూరు మండలంలో మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించు కున్నవారిని ఆయా గ్రామాల్లో అధికారులు ఘనంగా సన్మానించారు.


కోటలో..


కోట, జనవరి 25 : స్థానిక తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా  కోటకు చెందిన పలువురు సీనియర్‌ సిటిజన్‌లను తహసీల్దారు పద్మావతి, డీటీ మల్లికార్జున్‌రా వులు పూలమాలలతో సన్మానించి షీల్డ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా వీఆర్వోలకు, సచివాలయ మహిళా ఉద్యోగులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు తహసీల్దారు, డీటీలు బహుమతు లు ప్రదానం చేశారు. 






Updated Date - 2022-01-26T02:39:08+05:30 IST