ప్రతి ఒక్కరూ అందం కోసం శ్రద్ధ వహిస్తున్నారు: బిగ్‌బాస్‌ ఫేమ్‌ Kajal

ABN , First Publish Date - 2022-07-26T22:03:24+05:30 IST

కరోనా పాండమిక్ తర్వాత మహిళలు, యువత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యంపై శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు.. బిగ్‌బాస్‌ ఫేమ్, ఆర్‌జె కాజల్‌ (Kajal). సోమవారం కొండాపూర్‌లో

ప్రతి ఒక్కరూ అందం కోసం శ్రద్ధ వహిస్తున్నారు: బిగ్‌బాస్‌ ఫేమ్‌ Kajal

కరోనా పాండమిక్ తర్వాత మహిళలు, యువత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యంపై శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు.. బిగ్‌బాస్‌ ఫేమ్, ఆర్‌జె కాజల్‌ (Kajal).  సోమవారం కొండాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డెర్మా 360 స్కిన్‌ అండ్‌ లేజర్‌ క్లినిక్‌ (derma 360 Skin and laser clinic)ను ఆమె తెలుగు ఇండియన్‌ ఐడల్‌ (Telugu Indian Idol) సింగర్‌ వైష్ణవి (Singer Vaishnavi) తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘ కరోనా ప్రభావంతో వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కారణంగా చాలా మంది సూర్యరశ్మికి నోచుకోవడం లేదు. తద్వారా జుట్టు ఊడిపోవడం, చర్మంలో వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి. అలాంటి సమస్యలు ఎదుర్కొనే వారందరికీ ఇలాంటి అత్యాధునిక పరిజ్ఞానంతో వస్తున్న క్లినిక్స్ ఎంతో ఉపయోగపడతాయి..’’ అని అన్నారు. డెర్మా 360 స్కిన్‌ అండ్‌ లేజర్‌ క్లినిక్‌‌లో సుమారు 25 రకాల చికిత్సలు అందిస్తున్నట్లుగా డాక్టర్ శిరీష యనగల్ల తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సూరజ్ ఉప్పలపాటితో పాటు పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు.



Updated Date - 2022-07-26T22:03:24+05:30 IST