జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల పట్టణంలో గల మైనారిటీ గురుకుల కళాశాలలో డిప్యూటీ వార్డన్ రెచ్చిపోయాడు. చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ నయీం కొట్టాడు. విద్యార్థిని కింద పడవేసి కాళ్లతో తన్ని ఆపై మొహంపై పిడిగుద్దులు గుద్దాడు. విద్యార్థి ప్రాధేయపడినా కనికరించకుండా డిప్యూటీ వార్డెన్ తీవ్రంగా హింసించాడు. విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థి రాజును అకారణంగా కొట్టిన నయీంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.
ఇవి కూడా చదవండి