కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ బడులు

ABN , First Publish Date - 2020-10-23T11:29:41+05:30 IST

కార్పొరేట్‌ స్కూల్స్‌ను తలదన్నేలా ప్రభుత్వబడులను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అన్నారు.

కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ బడులు

ఏలూరులో నాడు-నేడు పాఠశాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి నాని 


ఏలూరు రూరల్‌, అక్టోబరు 22 : కార్పొరేట్‌ స్కూల్స్‌ను తలదన్నేలా ప్రభుత్వబడులను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అన్నారు. రూరల్‌ మండలం శనివారపుపేట ఇందిరాకాలనీలో మన బడి-నాడు నేడు కింద నవీకరించిన ఎంపీపీ పాఠశాలను గురువారం కలెక్టర్‌ ముత్యాలరాజు, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరితో కలిపి ఆయన ప్రారంభించారు. నాని మాట్లాడుతూ కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను నవీకరి స్తున్నామన్నారు. ఈ పాఠశాలలు పేద పిల్లల ఉన్నత భవిష్యత్తుకు మార్గ నిర్ధేశంగా నిలవనున్నా యని చెప్పారు. ఏలూరు నియోజకవర్గంలో 113 పాఠశాలలకుగాను రూ.4.24 కోట్లతో 25 పాఠశాల లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.


నవంబరు 2 నుంచి దశల వారీగా పాఠశాలలను ప్రారంభించు కునే ఆలోచన చేస్తున్నామన్నారు. కలెక్టర్‌ ముత్యాల రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ గల ఉపాధ్యాయులు ఉండేవారు. కానీ, మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉండేవి. నాడు - నేడు ద్వారా మౌలిక వసతులు కార్పొరేట్‌ స్థాయిలో కల్పించడంతో విద్యార్థుల హాజరు శాతం గణనీ యంగా పెరిగిందన్నారు. డీఈవో సీవీ రేణుక, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రభాస్కరరెడ్డి, సమగ్ర శిక్ష పీవో కాత్యాయనీ ప్రసన్న, ఎంపీడీవో జీఆర్‌ మనోజ్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ చంద్రశేఖర్‌, పాఠశాల హెచ్‌ఎం ఝాన్సీరాణి, నాడు - నేడు ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ రూజ్‌వెల్ట్‌, విద్యా కమిటీ వైస్‌ చైర్మన్‌ లావణ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T11:29:41+05:30 IST