ఏలూరు రూపురేఖలు మారుస్తాం

ABN , First Publish Date - 2020-09-27T07:37:43+05:30 IST

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతో ఏలూరు నియోజకవర్గం రూపురేఖలు మార్చివేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు. శనివారం మంత్రి క్యాంపు....

ఏలూరు రూపురేఖలు మారుస్తాం

ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని


ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 26 : జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతో ఏలూరు నియోజకవర్గం రూపురేఖలు మార్చివేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని పేర్కొన్నారు. శనివారం మంత్రి క్యాంపు కార్యా లయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌, నగరపాలక సంస్థ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ అధి కారులతో నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రోడ్లు, డ్రెయిన్లు, సెంట్రల్‌ పార్కింగ్‌, సెంట్రల్‌ లైటింగ్‌ వంటి పను లు వేగవంతం చేయాలని ఆదేశించారు. పేదలు నివసించే స్లమ్‌ ఏరియాల్లో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి అధిక నిధులు కేటాయించి పనులు చేపట్టాలని సూచించారు. ఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా మంజూరైన రూ.పది కోట్లకు దీనికి సంబం ధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అదనంగా రూ.10 కోట్లు నిధు లు మంజూరు చేయడానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నారు. గ్రామ సచివాల యాలు, ఆర్‌బీకే, అర్బన్‌ హెల్త్‌ క్లీనిక్‌ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని రెండు రోజుల్లో పనులు స్వయంగా పరిశీలిస్తానని నాని చెప్పారు. మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, పి.హరిబాబు, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఎస్‌ఈ రాఘవులు, ఎంపీడీవో మనోజ్‌, పీఆర్‌ఈఈ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T07:37:43+05:30 IST