సమస్యలపై నిలదీత

ABN , First Publish Date - 2022-05-18T04:33:20+05:30 IST

వనపర్తి జిల్లా పరిషత్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎన్నిసార్లు చెబుతున్నా సమస్యలను పరిష్కరించకుండా చేస్తామని తప్పించుకుంటున్నారని అధికారులను పాలకవర్గ సభ్యులు నిలదీశారు.

సమస్యలపై నిలదీత
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

- వనపర్తి జడ్పీ సర్వసభ్య సమావేశంలో సమస్యల వెల్లువ

- విద్య, విద్యుత్‌ అధికారులను నిలదీసిన పాలకవర్గ సభ్యులు

- సమన్వయం చేసుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం


(ఆంధ్రజ్యోతి, వనపర్తి): వనపర్తి జిల్లా పరిషత్‌ సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎన్నిసార్లు చెబుతున్నా సమస్యలను పరిష్కరించకుండా చేస్తామని తప్పించుకుంటున్నారని అధికారులను పాలకవర్గ సభ్యులు నిలదీశారు. వన పర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశం జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ప్రధానంగా అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పాలకవర్గ సభ్యులు లేవనెత్తారు. ముందుగా విద్యాశాఖపై సమీక్ష జరగ్గా విద్యాధికారి రవీందర్‌ మన ఊరు, మన బడి ప్రణాళికలను, ప్రగతిని సభ్యులకు చదివి వినిపిం చారు. అయితే విద్యాశాఖ అవలంభిస్తున్న వైఖరిపై సభ్యులు తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేశారు. మదనాపూర్‌ జడ్పీటీసీ సభ్యడు కృష్ణయ్య మాట్లాడుతూ వివిధ స్కీంల ద్వారా ఈ పథకానికి నిధులు సేకరిస్తున్నారని, కానీ ఎంఎన్‌ ఆర్‌ఈజీఎస్‌ కింద చేపట్టాల్సిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు బిల్లులు రావనే భయంతో ముందుకు రావడం లేదని తెలిపారు. బిల్లుల మంజూరుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. శ్రీరంగాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ మన ఊరు, మన బడి కార్యక్రమం అమలులో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి మాట్లాడుతూ తమకు సమాచారం లేకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా కేవలం అధికారులే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌ మాట్లాడుతూ అదనపు తరగతి గదుల అవసరం చాలా పాఠశా లల్లో ఉందని, వాటిపై ప్రతిపాదనలను తీసుకోవడం లేదని, ఒక్కో తరగతి గదిలో మూడు, నాలుగు తరగతుల వారు సర్దుకోవాల్సిన అవసరం ఏర్పడిం దని అన్నారు. విద్యుత్‌శాఖపై జరిగిన సమీక్షలో సభ్యులు మాట్లాడుతూ గతంలో మంజూరు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లకు స్తంభాలు ఇవ్వకపోవడం వల్ల రైతులు కట్టెలపై వైర్లు తీసుకున్నారని, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహి స్తారని మదనాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు ప్రశ్నించారు. అలాగే పాఠశాలలు, ఇళ్లపై వెళ్తున్న లైన్లను రీలొకేషన్‌ చేయడానికి పట్టణ ప్రగతిలో పనులు చేప ట్టాలని శ్రీరంగాపూర్‌ జడ్పీటీసీ కోరారు. అలాగే ట్రాన్ష్‌ఫార్మర్ల వద్ద ఏపీ స్వి చ్చులు అమర్చాలని సభ్యులందరూ కోరారు. గణపసముద్రంలో ఉన్న మోటా ర్లకు సంబంధించి అవి రన్‌ కాకపోయినా సర్వీసు చార్జీ ఎలా వసూలు చేస్తా రని ఆ మండల జడ్పీటీసీ సభ్యుడు సామ్యానాయక్‌ ప్రశ్నించారు. వైద్య శాఖపై జరిగిన సమీక్షలో అన్ని మండలాల సభ్యులు మాట్లాడుతూ నూత నంగా డొనేట్‌ చేసిన అంబులెన్స్‌లు నడవడం లేదని, ఎందుకు వాటిని నడి పించడం లేదని ప్రశ్నించారు. అలాగే పలు ఆస్పత్రుల్లో డాక్టర్లు అందు బాటులో ఉండటం లేదని సభ్యులు ఆరోపించారు. మిగతా శాఖలకు సంబం ధించి కూడా పలువురు సభ్యులు అధికారులను ప్రశ్నించగా వారు బదులిచ్చి సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆశిష్‌సంగ్వాన్‌, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, పాలకవర్గ సభ్యు లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-18T04:33:20+05:30 IST