క్లాప్‌ డ్రైవర్ల విధుల బహిష్కరణ

ABN , First Publish Date - 2022-09-27T06:27:52+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించాలంటూ జీవీఎంసీ గాజువాక జోన్‌ పరిధిలోని క్లాప్‌ వాహనాల డ్రైవర్లు సోమవారం విధులు బహిష్కరించి ఒకరోజు సమ్మెకు దిగారు.

క్లాప్‌ డ్రైవర్ల విధుల బహిష్కరణ
నిరసన తెలుపుతున్న క్లాప్‌ డ్రైవర్లు

వీధుల్లో ఎక్కడికక్కడ తిష్ఠ వేసిన చెత్త

గాజువాక, సెప్టెంబరు 26: తమ సమస్యలను పరిష్కరించాలంటూ జీవీఎంసీ గాజువాక జోన్‌ పరిధిలోని క్లాప్‌ వాహనాల డ్రైవర్లు సోమవారం విధులు బహిష్కరించి ఒకరోజు సమ్మెకు దిగారు. దీంతో చెత్త సేకరణ వాహనాలన్నీ నిలిచిపోయాయి. గాజువాక జోన్‌లో సుమారు 110 మంది క్లాప్‌ వాహనాల్లో డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రభుత్వ జీవో ప్రకారం నెలకు రూ.18,500 చెల్లించాల్సి వుండగా కేవలం రూ.10,044 మాత్రమే అందిస్తున్నారని.. అదికూడా సకాలంలో చెల్లించడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఇచ్చే అరకొర జీతాలను కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. క్లాప్‌ వాహనాలు నిలిచిపోవడంతో వీధుల్లో చెత్త ఎక్కడపడితే అక్కడ నిలిచిపోయింది. 

Updated Date - 2022-09-27T06:27:52+05:30 IST