వాట్సాప్‌ ద్వారా రవాణా శాఖ సేవలు

ABN , First Publish Date - 2021-05-06T05:20:56+05:30 IST

కరోనా నేపథ్యంలో రవాణా శాఖ సేవలను వాట్సాప్‌ ద్వారా అందజేయనున్నట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు.

వాట్సాప్‌ ద్వారా రవాణా శాఖ సేవలు


విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో రవాణా శాఖ సేవలను వాట్సాప్‌ ద్వారా అందజేయనున్నట్టు డీటీసీ రాజారత్నం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సులు, రిజిస్ర్టేషన్‌ వంటి సేవలను పొందవచ్చుననన్నారు. నాన్‌ ట్రాన్స్‌పోర్టు లావాదేవీల కోసం 98485283208 (ఆర్‌టీవో), 9154294307 (ఏ.ఓ)ను, ట్రాన్స్‌పోర్టు వాహనాలకు సంబంధించిన సేవల కోసం అయితే 7815856891 (ఆర్‌టీఓ), 9848528321 (ఏ.ఓ), 9652516725 (ఏ.ఓ) నంబర్లకు సంప్రతించాలని సూచించారు.


Updated Date - 2021-05-06T05:20:56+05:30 IST