ఏసీబీ అదుపులో నెల్లూరు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

ABN , First Publish Date - 2020-12-03T09:00:29+05:30 IST

ఏసీబీ అదుపులో నెల్లూరు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

ఏసీబీ అదుపులో నెల్లూరు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

నెల్లూరు(క్రైం), డిసెంబరు 2: ఆదాయానికి మించిన ఆస్తులను కూడగట్టారన్న అభియోగంతో ఎస్పీడీసీఎల్‌ నెల్లూరు ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి ఇంటితోపాటు ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల నివాసాల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిపిన ఈ సోదాల్లో విజయకుమార్‌కు రూ.మూడు కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి కొన్ని కీలక పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-12-03T09:00:29+05:30 IST