ఎస్మా ఆదేశాలపై వెనక్కి తగ్గిన మైనింగ్‌ శాఖ

ABN , First Publish Date - 2022-02-06T02:22:08+05:30 IST

మైనింగ్‌ శాఖలో ఎస్మా ప్రయోగంపై ఉద్యోగ సంఘాలు మండిపడడంతో

ఎస్మా ఆదేశాలపై వెనక్కి తగ్గిన మైనింగ్‌ శాఖ

అమరావతి: మైనింగ్‌ శాఖలో ఎస్మా ప్రయోగంపై ఉద్యోగ సంఘాలు మండిపడడంతో ఎస్మా ఆదేశాలపై మైనింగ్‌ శాఖ వెనక్కి తగ్గింది. అవసరమైతే ప్రభుత్వమే ఆదేశాలు ఇస్తుందని మైనింగ్‌శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రొసీడింగ్స్‌ను మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి విడుదల చేశారు. 


ఒకవైపు చర్చలు, మరోవైపు ఎస్మా ప్రయోగాలు అంటూ ప్రభుత్వం  ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.  తాజాగా మైనింగ్ శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మైనింగ్ శాఖలో సమ్మె, ఇతర ఆందోళనలపై నిషేధం విధించింది. సమ్మెకి దిగితే ఎస్మా ప్రయోగిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్‌శాఖలో ఎస్మా ఉత్తర్వులపై ఉద్యోగులు నివ్వెరపోతున్నారు.  


మైనింగ్‌శాఖలో ఎస్మా ప్రయోగంపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. ఒకవైపు చర్చలు చేస్తూ మరోవైపు ఎస్మా ప్రయోగమేంటని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్‌ ప్రశ్నించింది. ఎస్మా ప్రయోగం అప్రజాస్వామికమని ఏపీటీఎఫ్‌ నేత వరప్రసాద్‌ అన్నారు. ప్రభుత్వం ఇలాంటి ప్రయోగాలు మానుకోవాలన్నారు. 


Updated Date - 2022-02-06T02:22:08+05:30 IST