IITHలో హెరిటేజ్‌ సైన్స్ కోర్సులు

ABN , First Publish Date - 2022-07-01T21:43:10+05:30 IST

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీహెచ్‌) ఆధ్వర్యంలోని హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం(Department of Heritage Science and Technology) - ఎంటెక్‌, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది

IITHలో హెరిటేజ్‌ సైన్స్ కోర్సులు

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(Indian Institute of Technology)(ఐఐటీహెచ్‌) ఆధ్వర్యంలోని హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం(Department of Heritage Science and Technology) - ఎంటెక్‌, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటిని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. టెక్నాలజీ ఫర్‌ యోగ, ఇండిక్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, కన్జర్వేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా కోర్‌ కోర్సులు, స్ట్రీం కోర్సులు, ఎలక్టివ్‌ కోర్సులు ఉంటాయి. 


టెక్నాలజీ ఫర్‌ యోగ సబ్జెక్టులు: బయోమెడికల్‌ సెన్సింగ్‌, అనాటమీ అండ్‌ ఫిజియాలజీ, మెషిన్‌ లెర్నింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, న్యూరోసైన్స్‌, న్యూరోఇమేజింగ్‌, సాంఖ్య, యోగ, ఆయుర్వేద.

ఇండిక్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ సబ్జెక్టులు: మెషిన్‌ లెర్నింగ్‌ - ఎన్‌ఎల్‌పీ, కంపైలర్స్‌, స్పీచ్‌ అండ్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ ఫర్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌, కంప్యూటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, మాన్యుస్ర్కిప్టాలజీ, ఎపిగ్రఫీ, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్త.

కన్జర్వేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సబ్జెక్టులు: ఆర్కిటెక్చరల్‌ డిజైన్‌ ప్రిన్సిపల్స్‌, ఏఐ బేస్డ్‌ డిఫెక్ట్‌ మ్యాపింగ్‌, ఏఆర్‌ - వీఆర్‌ - హెరిటేజ్‌ రీకన్‌స్ట్రక్షన్‌, విజువలైజేషన్‌, ప్లానింగ్‌, మనసర, సమరాంగణ సూత్రధార తదితరాలు.

ఎంటెక్‌ ఇన్‌ హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. రిసెర్చ్‌/ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ప్రధానంగా ఏడాది ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉంటుంది. కోర్సు వర్క్‌లు, థీసిస్‌ వర్క్‌లకు ఒక్కోదానికి 24 చొప్పున మొత్తం 48 క్రెడిట్స్‌ నిర్దేశించారు. మొదటి ఏడాది కోర్సు పూర్తిచేసిన తరవాత ప్రోగ్రామ్‌ నుంచి వైదొలగే వీలుంది.

అర్హత: ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌/మెడిసిన్‌/సైన్స్‌ విభాగాల్లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగాల్లోనే మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్ల ఎమ్మెస్సీ పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ4.2లక్షలు

పీజీ డిప్లొమా ఇన్‌ హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. కోర్సు వర్క్‌లకు 24 క్రెడిట్స్‌ నిర్దేశించారు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రోగ్రామ్‌ ఫీజు: రూ2.7 లక్షలు


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 7 

ఈమెయిల్‌: admissions@hst.iith.ac.in

వెబ్‌సైట్‌: www.iith.ac.in

Updated Date - 2022-07-01T21:43:10+05:30 IST