Abn logo
Mar 2 2021 @ 23:36PM

పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

నవీపేట, మార్చి 2 : మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర, బా లికల ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల మోడల్‌ పాఠశాలతోపాటు మో కన్‌పల్లి కేజీబీవీ పాఠశాలను డీఈవో దుర్గాప్రసాద్‌ మంగళవారం తనిఖీ చేశా రు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం తరగతులను నిర్వహించాలని ఉపాధ్యా యులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో 75 శాతం విద్యార్థు లు హాజరువుతుండగా ప్రైవేటు పాఠశాలలో 50 శాతం వరకు విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం ఉర్దూ మీడియం ఉన్నత పాఠశా లలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యారుర్థులకు నాణ్యమైన భోజ నాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈవో గణేష్‌రావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు నవీన్‌కుమార్‌, అరుణ, అనురాధ, విజయలక్ష్మీ, రాణి తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement