Abn logo
Dec 2 2020 @ 23:51PM

పాఠశాలల్లో పారిశుధ్య పనులు శ్రద్ధగా నిర్వహించాలి

ఆన్‌లైన్‌ తరగతులపై విద్యార్థిని అడిగి తెలుసుకుంటున్న విద్యాధికారి జగన్‌మోహన్‌రావు

కోరుట్ల రూరల్‌, డిసెంబరు 2: పాఠశాలలో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుఽధ్య పనులు శ్రద్ధగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి జగన్‌ మోహన్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని జోగినిపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. గ్రామంలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్‌లైన్‌ తరగతుల వివరాలను అడిగి తెలసుకున్నారు. ఈ సంద ర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, యువజన సంఘ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధ నను అందించే విధానం వివరించారు. ఈ కార్యక్రమంలో మండ ల విద్యాధికారి గంగుల నరేశం, గ్రామ సర్పంచ్‌ దుంపాల నర్సు -రాజనర్సయ్య, ఎస్‌ఎంసీ చైర్మెన్‌ పోతవేణి రాజేశం, ఉపాధ్యా యులు అమర్నాథ్‌, శ్రీనివాస్‌, పద్మశ్రీలతో పాటు పలువురు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement