‘నాడు- నేడు’లో నిర్లక్ష్యంగా ఉంటే వేటే !

ABN , First Publish Date - 2020-07-09T09:53:35+05:30 IST

నాడు-నేడు పనుల్లో కొందరు అధికారులు అవలంభిస్తున్న నిర్లక్ష్యం కలెక్టర్‌, క మిషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దృష్టికి వెళితే వేటు

‘నాడు- నేడు’లో నిర్లక్ష్యంగా ఉంటే వేటే !

3.60 లక్షల మంది విద్యార్థుల భవిత మీ చేతుల్లో ..

వీసీలో డీఈఓ శామ్యూల్‌


అనంతపురం విద్య, జూలై 8: నాడు-నేడు పనుల్లో కొందరు అధికారులు అవలంభిస్తున్న నిర్లక్ష్యం కలెక్టర్‌, క మిషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దృష్టికి వెళితే వేటు తప్పదని డీఈఓ శామ్యూల్‌ అధికారులను హెచ్చరించారు. బుధవా రం ఆయన 19 మండలాలకు చెందిన అధికారులతో 45 నిమిషాలు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మెటీ రి యల్‌ కొనుగోళ్లలో గోరంట్ల, బ్రహ్మసముద్రం, నల్లమాడ, రామగిరి, ఓడీసీ తదితర మండలాలు 72 శాతంలోపు ఉన్నాయన్నారు. వెంటనే కొనుగోళ్లు పెంచాలని తెలిపారు. అమడగూరు, ఓడీసీ, తాడిమర్రి, తనకల్లు మండలాల్లో ఒక్క పాఠశాలకు కూడా మరుగుదొడ్ల పైకప్పు పడలేద న్నారు.


పనుల్లో బుక్కరాయసముద్రం, శెట్టూరు మండలాలు 100శాతం పనులు పూర్తిచేశారని, ఇతర మండలాలు సైతం త్వరగా పూర్తిచేయలన్నారు. తాగునీటి పనుల్లో గోరంట్ల మండలంలో 7 పాఠశాలల్లో, తలుపులలో 3,  అనంతలో 4 పాఠశాలల్లో పనులు పూర్త య్యాయన్నారు. అమడగూరు, ఓడీసీ, రామగిరి, తాడిమ ర్రి, కొత్తచెరువులో  పనులు పూర్తి కాలేదన్నారు. ముఖ్యం గా ఓడీసీ మండలంలో నాడు-నేడు పనులు చాలా అం శాల్లో జాప్యం అవుతోందన్నారు. ఆగస్టు 3 నాటికి జిల్లా వ్యాప్తంగా 3.6 లక్షల మంది విద్యార్థులకు  ఎలాంటి సమ స్య లేకుండా  చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.  సమావేశంలో ఏపీసీ రవూఫ్‌, సెక్టోరియల్‌, ఇతర అధికా రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T09:53:35+05:30 IST