Abn logo
Apr 21 2021 @ 01:25AM

తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు : డీఈవో

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 20 : ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 1వ తరగతి నుంచి 9వతరగతి లోపు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఈవో తెహారా సుల్తానా హెచ్చరించారు. మంగళవారం ఆమె బందరులో మీడియాతో మాట్లాడారు. తరగతులు నిర్వహించే పాఠశాలల గుర్తింపు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

టీపీటీ, హెచ్‌పీటీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

  తెలుగు పండిట్‌, హిందీ పండిట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌లను సంబంధిత వెబ్‌ సైట్‌నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని డీఈవో తహెరా సుల్తానా తెలిపారు. టీపీటీ,  హెచ్‌పీటీ విద్యార్థులకు ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 

Advertisement
Advertisement
Advertisement