ఉన్నత పాఠశాలల్లో డీఈవో తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-23T05:19:46+05:30 IST

గొల్లప్రోలు, జనవరి 22: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలు రు, బాలికోన్నత, తాటిపర్తిలోని ఉన్నత పాఠశాలలను శనివారం జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహాం తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి విద్యార్థులకు బోధన జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. జిల్లాపరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో మధ్యాహ్న బోజన పథకం నాణ్యత సరిగా ఉండటం లేదని గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు

ఉన్నత పాఠశాలల్లో డీఈవో తనిఖీలు
గొల్లప్రోలు జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తున్న డీఈవో అబ్రహాం

గొల్లప్రోలు, జనవరి 22: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలు రు, బాలికోన్నత, తాటిపర్తిలోని ఉన్నత పాఠశాలలను శనివారం జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహాం తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి విద్యార్థులకు బోధన జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. జిల్లాపరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో మధ్యాహ్న బోజన పథకం నాణ్యత సరిగా ఉండటం లేదని గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు ప్రశ్నించిన నేపథ్యంలో భోజనంలో భాగంగా వండిన పదార్థాల నాణ్యతను డీఈవో పరిశీలించారు. ఆర్‌ఎంఎ్‌సఏ పథకంలో భాగంగా తాటిపర్తి, వన్నెపూడి ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లోవరాజు డీఈవోను కోరారు. తాటిపర్తి సర్పంచ్‌ కట్టా బుల్లేశ్వరరావు, ఉప సర్పంచ్‌ దాసం వెంకటేష్‌, దుర్గాడ ఎంపీటీసీ జ్యోతుల శ్రీను, హైస్కూలు కమిటీ చైర్మన్‌ కందా శ్రీనివాస్‌, చెందుర్తి ఉప సర్పంచ్‌ కోనేటి పెదకాపు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:19:46+05:30 IST