Abn logo
Nov 29 2020 @ 00:39AM

క్రమంతప్పకుండా విధులకు హాజరు కావాలి : డీఈవో

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 28: ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో మూతబడిన పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులతో పాటు దూరదర్శన్‌, టీ సాట్‌ ద్వారా కొనసాగుతున్న క్లాసులను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు క్రమంతప్పకుండా విధులకు హాజరు కావాలని డీఈవో రవీందర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రాంనగర్‌లో గల జడ్పీఎ్‌సఎస్‌ అర్బన్‌ పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ తరగతులపై పలు సూచనలు జారీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చదువులపై ప్రత్యేకదృష్టి సారించాలని, వారి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ఇందులో భాగంగా అటెండెన్స్‌ రిజిస్ట్రర్లను పరిశీలించి న ఆయన పాఠశాలకు రాకపోయిన రిజిస్ట్రర్‌లో సంతకాలు చేసినందుకు గాను ఉపాధ్యాయుడు వరారుషి ఒక్కరోజు వేతనం కట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కావద్దని హెచ్చరించారు.

Advertisement
Advertisement