హైదరాబాద్: ఓయూలో ఏఐసీసీ నేత రాహుల్ సభకు వీసీ అనుమతి నిరాకరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ఓయూలో రాహుల్ పర్యటనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన రాహుల్‌కి ఇదేనా బహుమతి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ నేతలకు ఓయూలో అనుమతి లేదనే తీర్మానాన్ని ఇప్పుడే బయటపెట్టడంలో మతలబేంటని ఆయన నిలదీశారు. సమైక్య రాష్ట్రంలో ఓయూలో లేని నిబంధనలు కోరి తెచ్చుకున్న తెలంగాణలో నిబంధనలా అని ఆయన మండిపడ్డారు. ఇది సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి