Dengue fever: హడలెత్తిస్తున్న డెంగీ

ABN , First Publish Date - 2022-07-27T18:04:16+05:30 IST

రాష్ట్రంలో పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో డెంగీ(Dengue) కేసులు పెరుగుతున్నాయి. కేవలం వారం రోజుల అవధిలోనే రాష్ట్రంలో

Dengue fever: హడలెత్తిస్తున్న డెంగీ

- రాష్ట్రవ్యాప్తంగా 1100 కేసుల గుర్తింపు

- పరిశుభ్రత పాటించి.. దోమలను పారదోలాలి

- ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ 


బెంగళూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో డెంగీ(Dengue) కేసులు పెరుగుతున్నాయి. కేవలం వారం రోజుల అవధిలోనే రాష్ట్రంలో కొత్తగా 344 డెంగీ కేసులను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా, తాలూకా ఆసుపత్రులకు జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పులు వంటి డెంగీ లక్షణాలతో వస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పూర్తిస్థాయి అప్రమత్తత పాటించాలని ప్రభుత్వం హెచ్చరికలు(Warnings) జారీ చేసింది. ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ బెంగళూరు(Bangalore)లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా(Covid) కేసులకంటే డెంగీ కేసులు అధికంగా ఉన్నాయనే సమాచారం అందిందన్నారు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 1100 డెంగీ కేసులను గుర్తించామన్నారు. జనవరి నుంచి ఇంతవరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4వేలకుపైగా డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు. పేరుకుపోతున్న చెత్త, వర్షాల కారణంగా, నీటితో నిండిన కుంటల కారణంగా దోమలు ప్రబలి డెంగీకి కారణమవుతున్నాయన్నారు. బెంగళూరు నగరంలోనే నెల అవధిలో 138 డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు. హఠాత్తుగా జ్వరం రావడం, భరించలేనంత తలనొప్పి, జలుబు, వాంతులు, కడుపునొప్పి, ఒంటినొప్పి, అతిసార వంటి లక్షణాలు ఏమాత్రం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. అన్ని జిల్లాల వైద్య అధికారులకు డెంగీకి సం బంధించి అప్రమత్తత సలహాలు ఇచ్చామన్నారు. చిత్రదుర్గ(Chitradurga), దావణగెరె, శివమొగ్గ, బెళగావి, విజయపుర, కలబురగి, కొప్పళ, మైసూరు, హాసన్‌, ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్లు గుర్తించామన్నారు. సోమవారం బళ్లారి జిల్లా కంప్లి తాలూకా గోనె హాళ్‌ గ్రామంలో అతిసారతో ఒక బాలిక మృతి చెందడంపై కలెక్టర్‌ పవన్‌కుమార్‌ మాలపాటి అధికారులపై కొరడా ఝులిపించారు. సకాలంలో స్పందించని పంచాయతీ సభ్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మంగళవారం వైద్య సిబ్బంది గ్రామంలో వైద్యసేవలు కొన సా గించారు. దీంతో అంతా కోలుకున్నారు.

Updated Date - 2022-07-27T18:04:16+05:30 IST