డెంగీ, మలేరియా నివారణకు కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-10-19T04:55:48+05:30 IST

డెంగీ, మలేరియా నివారణకు కృషిచేయాలి

డెంగీ, మలేరియా నివారణకు కృషిచేయాలి

నర్సంపేట టౌన్‌, అక్టోబరు 18 : నర్సంపేట మునిసిపాలిటీ పరిధిలోని వా ర్డులతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో డెంగీ, మలేరియా  నివారణకు మునిసిపల్‌, పంచాయతీ అధికారులు, సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టాలని జి ల్లా మలేరియా అధికారి డాక్టర్‌ సీహెచ్‌.మధుసూదన్‌  వైద్య అధికారులు, సి బ్బందిని ఆదేశించారు. నర్సంపేట మండలం భాంజిపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సోమమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ పరిధి లో దోమల సంబంధిత వ్యాధుల వివరాలను వైద్యాధికారి భూపేష్‌ను అడిగి తె లుసుకున్నారు.  దోమల నివారణకు, దోమల ఆవాస ప్రాంతాలైన నీటి గుంట లు, మురుగుకాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించేలా ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. పీహెచ్‌సీలో మలేరియా  నిర్ధారణ పరీక్షలు, ర్యాపిడ్‌ ఆంటిజన్‌ టెస్టులు, రక్తనమూనాలు సేకరించాలన్నారు. సబ్‌ యూని ట్‌ అధికారి, నంద, మాడిశెట్టి శ్రీనివాస్‌, డాక్టర్‌ అనిత, ల్యాబ్‌టెక్నిషియన్‌ నవీన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T04:55:48+05:30 IST