Chennaiలో ప్రబలుతున్న డెంగ్యూ

ABN , First Publish Date - 2021-11-25T13:12:26+05:30 IST

నగరంలో వర్షాల కారణంగా దోమల బెడద అధికం కావటంతో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయని, ఈ జ్వర నిరోధానికి తగిన చర్యలు తీసు కుంటున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు.

Chennaiలో ప్రబలుతున్న డెంగ్యూ

                     - సత్వర చర్యలు: మంత్రి సుబ్రమణ్యం


చెన్నై: నగరంలో వర్షాల కారణంగా దోమల బెడద అధికం కావటంతో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయని, ఈ జ్వర నిరోధానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక రాయపురంలోని స్టాన్లీ వైద్యకళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకేసారి వంద రోగులకు సరఫరా చేయగల సామర్థ్యంతో కూడిన రూ.2.14 కోట్ల విలువైన ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆరుగురు డెంగ్యూ జ్వరాలకు మృతిచెందారని తెలిపారు. రాష్ట్రమంతటా డెంగ్యూ జ్వరాలతో 516 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 76 శాతం మందికి మొదటి డోసు కరోనా నిరోధక టీకాలు వేశామని, 40 శాతం మంది రెండో డోసు టీకాలు వేసుకున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీన్‌ నారాయణబాబు, శాసనసభ్యుడు ఐడ్రీమ్‌ మూర్తి, స్టాన్లీ ఆస్పత్రి నిర్వాహకులు జమీలా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-25T13:12:26+05:30 IST