కోడి పందేల్లో చింతమనేని.. వీడియో విడుదల చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-07-08T00:44:10+05:30 IST

పటాన్‌చెరు మండలం చినకంజర్ల శివారులో కోడి పందాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ పందేల్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారని...

కోడి పందేల్లో చింతమనేని.. వీడియో విడుదల చేసిన పోలీసులు

హైదరాబాద్ (Hyderabad): పటాన్‌చెరు మండలం చినకంజర్ల శివారులో కోడి పందేలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ పందేల్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chinthamanani Prabhakar) పాల్గొన్నారని...తాము రైడ్ చేసిన సమయంలో పారిపోయారని పోలీసులు తెలిపారు. అయితే తాను అక్కడ లేనని.. రాక్షస రాజకీయం అవసరమా? అని చింతమనేని ప్రభాకర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. దాంతో కోడిపందేల్లో చింతమనేని ప్రభాకర్ ఉన్న వీడియోను పోలీసులు విడుదల చేశారు. కోడి పందేల శిబిరం నుంచి వెళ్లిపోతున్న చింతమనేని దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 



Updated Date - 2022-07-08T00:44:10+05:30 IST