ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్య తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-03-01T06:44:56+05:30 IST

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్య తీసుకోవాలి

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్య తీసుకోవాలి
ఎమ్మెల్యే రాజాసింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న డీహెచ్‌పీఎ్‌స నేతలు

మహబూబాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 28 : గోవధ, గో మాంసం తినేవారిని ఉద్ధేశించి హైదరాబాద్‌లోని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై జిల్లాకేంద్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎ్‌స) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రావణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలో డీహెచ్‌పీఎ్‌స ఆధ్వర్యంలో రాజాసింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఐకమత్యంగా ఉన్న దేశప్రజల మధ్య చిచ్చు పెట్టేలా రాజాసింగ్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కురాకుల పాల్‌, లింగాల విజయ్‌, దేవేందర్‌, చిరంజీవి, అభిలాష, శ్యాం, నర్సయ్య, అశోక్‌ పాల్గొన్నారు.

ఫ కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో రాజాసింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్‌ మాట్లాడుతూ దళిత, ముస్లిం, ఆచార వ్యవహారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. చీపిరి యాకయ్య, మచ్చ వెంకన్న, సూర్నపు రాజు, నాగరాజు,వెంకన్న, శ్రీనివాస్‌, కిరణ్‌, వెంకటేష్‌, రాము పాల్గొన్నారు. రాజాసింగ్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జీ గుగ్గిళ్ల పీరయ్య డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ హన్మంతునిగడ్డ, హరిజన వాడల్లో నిరసన వ్యక్తం చేశారు. భిక్షపతి, అంజిబాబు, దేవెందర్‌, నర్సయ్య, రామకృష్ణ, చాణక్య, మల్లయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T06:44:56+05:30 IST