రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

ABN , First Publish Date - 2022-09-29T05:43:03+05:30 IST

ఒక్క చాన్సు అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో ప్రజాపోరు సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.ఆదినారాయణరెడ్డి

వివేకా హత్యకేసులో దోషులెవరో త్వరలో కోర్టులు తేలుస్తాయి

అక్టోబరు నెలాఖరులోగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు

మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 28: ఒక్క చాన్సు అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రూ.5.60 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి కేవలం రూ.1.60లక్షల పప్పులు ప్రజలకు ఇచ్చి లక్షల కోట్లు దోచుకుని దాచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారన్నారు. సీఎం బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసును ఒక నాటకంగా రచించి తనపై కేసును బనాయించే ప్రయత్నాలు చేశారన్నారు. కానీ నేడు ఆ కేసు ఢిల్లీకి చేరిందని, త్వరలో నిందితులెవరో కోర్టులు తేల్చుతాయన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న వ్యక్తి, సీఎంకు అత్యంత సన్నిహితుడికి సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు అక్టోబరు నెలాఖరులోగా చోటు చేసుకుంటున్నాయన్నారు. అప్పుడు సీఎంకు పెద్ద సినిమా ఉంటుందన్నారు. ఇసుక, లిక్కర్‌, గనులు అమ్ముకుంటూ వేల కోట్లు దండుకుంటూ ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్నారని విమర్శించారు. కేంద్రం వేలాది కోట్లు ఇస్తుంటే వాటిని రాష్ట్రం ఖాతాలో వేసుకుని దోచుకుంటున్నారన్నారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే జగన్‌ ప్రయత్నానికి చెక్‌ పెట్టేందుకే తాము ఊరుఊరున రంగంలోకి దిగామన్నారు. వాడవాడలకు వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమ పాలనపై ఎండగడతామన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సిమెంటు ఫ్యాక్టరీలు రాకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జమ్మలమడుగు నియోజవర్గంలో జరుగుతున్న అన్ని స్కాంలను త్వరలో నిగ్గుతేలుస్తామన్నారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి లోక్‌సభలో, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రజల కోసం ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు సురేష్‌, మండల ఇన్‌చార్జి మేకల జగన్‌మోహన్‌రెడ్డి, చిలమకూరు ఎంపీటీసీ సభ్యుడు నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-29T05:43:03+05:30 IST