రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-10-21T05:05:38+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
రాజంపేటలో టీడీపీ నాయకులకు, పోలీసులకు జరిగిన తోపులాట

చిట్వేలి, అక్టోబరు20 : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బుధవారం చిట్వేలిలో బంద్‌కు తరలివచ్చిన ఆ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారన్నారు.  తెలుగు యువత రాష్ట్ర నాయకులు బొక్కసం సునీల్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు లారీ సుబ్బరాయుడు, బాలు రామాంజులనాయుడు, నాగార్జున, చంద్ర, వెంకటయ్య, షబ్బీర్‌, రమణయ్య,శ్రీనివాసులు, సుబ్బరాయుడు, దినేష్‌, శేఖర్‌, సాయి తదితరులు పాల్గొన్నారు. 

రాజంపేట హైవేపై పడుకొని రాస్తారోకో నిర్వహించిన బత్యాల 

రాజంపేట, అక్టోబరు20 : రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దాడులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయులు నేతృత్వంలో బుధవారం నిర్వహించిన బంద్‌ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త  పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని పట్టువస్త్రాలతోనే నేరుగా రాజంపేటకు వచ్చిన బత్యాలను హైవే వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో బత్యాల అక్కడే ఉన్న హైవేపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బత్యాలకు అండగా నిలుస్తూ రాస్తారోకో నిర్వహించారు.  డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, రాజంపేట పట్టణ సీఐ చంద్రశేఖర్‌ పలువురు ఎస్‌ఐలు, పోలీసులు బత్యాలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.  బత్యాలను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఉంచి అరెస్టు చేశారు. బత్యాలతో పాటు 16 మందిని అరెస్టు చేసి వదిలేశారు.  అదే విధంగా టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి కడవకూటి తిరుపతయ్య, రాజంపేట పార్లమెంట్‌ మహిళాధ్యక్షురాలు అనసూయాదేవి, యాదవ సంఘ ప్రధాన కార్యదర్శి భారతాల శ్రీధర్‌బాబు, పుత్తా రామచంద్రయ్య,  కొండా శ్రీనివాసులు, సంజీవరావు, సుబ్రహ్మణ్యంనాయుడు, గుగ్గిళ్ల చంద్రమౌళి, మనుబోలు వెంకటేశ్వర్లు, డీఆర్‌ఎల్‌ మణి, నాగినేని నాగేశ్వరనాయుడు,  నరసింహ,  అబుబకర్‌, కరిముల్లా, పీరూ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 తెల్లవారుజామునే ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్న టీడీపీ నేతలు..

బంద్‌ సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే పలువురు టీడీప నేతలు బస్సులు కదలనివ్వకుండా చేయడానికి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసినవెంటనే పట్టణ సీఐ చంద్రశేఖర్‌  టీడీపీ నేతలు సంజీవరావు, సుబ్రహ్మణ్యంనాయుడు, రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రతా్‌పరాజు, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ప్రచార కార్యదర్శి శివకుమార్‌, నాగేశ్వరనాయుడు తదితరులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

 దాడి వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ఠ

 రాయచోటిటౌన్‌, అక్టోబరు20: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై ఒకేసారి జరిగిన దాడులు వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు పరాకాష్ఠ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా ఆరోపించారు.  బుధవారం రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్‌ వద్ద ప్రభుత్వ పనితీరుపై నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌ తరలించకుండా పట్టణ పరిధిలోని అభి ఫంక్షన్‌ హాల్‌లో నిర్బఽంధించారు. ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, తెలుగు యువత రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర,  నాయకులు ఇనామ్‌, సాబీర్‌,  అబూజర్‌, రెడ్డెయ్య, జావేద్‌, హాజీమస్తాన్‌, ధనుంజయ, అతావుల్లా, మైనుద్దీన్‌, మన్సూర్‌ పాల్గొన్నారు. 

విధ్వంసాలకు పాల్పడుతున్న వైసీపీకి పుట్టగతులుండవు: కస్తూరి

రైల్వేకోడూరు, అక్టోబరు 20: విధ్వంసాలకు పాల్పడుతున్న వైసీపీకి పుట్టగతులు ఉండవని, వచ్చే ఎన్నికల్లో జగన్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ పాటించాలని టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి నుంచి రైల్వేకోడూరుకు వస్తున్న విశ్వనాథనాయుడు తన అనుచరులతో వస్తున్న ఆయనను బాలపల్లె చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని రైల్వేకోడూరు పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపంలో ఉంచారు. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుని నిరసనలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కళ్యాణ మండపం నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా రైల్వేకోడూరు ఎస్‌ఐ-1 పెద్దఓబన్న, పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి కోడూరు టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. డీజీపీ, ముఖ్యమంత్రి జగన్‌, హోం మంత్రి తదితరులపై డౌన్‌, డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.  పట్టణంలోని యువ టీడీపీ నాయకులు నార్జాల హేమరాజ్‌, పోతురాజు నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వేకోడూరు ఐదు మండలాల సరిహద్దుల్లో పోలీసులు మోహరించడం అన్యాయమని ఆరోపించారు. ముందస్తుగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని వారి వద్ద నుంచి సంతకాలు కూడా తీసుకున్నామని రైల్వేకోడూరు సీఐ కె. విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ-1 పెద్దఓబన్న వివరించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మాశివ, కేకే చౌదరి, వెంకటేశ్వర్‌రాజు, రాజంపేట పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు పి. రమేష్‌,  తేనేపల్లి చిన్నా, తులసి వెంకటేశ్వర్లు, రాజానాయుడు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:05:38+05:30 IST