రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-03-04T07:00:02+05:30 IST

రాష్ట్రంలో రాక్షసుడే పాలన చేయడం వల్ల రాజ్యాంగానికి కూడా గౌరవం దక్కడం లేదని, ప్రపంచ చరిత్రలోనే ఏ నియంత ఇంత అరాచకపాలన సాగించలేదని టీడీపీ పాలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింకాలయన అయ్యన్నపాత్రుడు అన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
టీడీపీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్న

  ప్రపంచ చరిత్రలోనే ఏ నియంత ఇంత అరాచకం లేదు

 ప్రజాస్వామ్యం, రాజ్యాంగం  గౌరవించేది టీడీపీ

 ‘పేట’ నియోజకవర్గ టీడీపీ  సమావేశంలో  అయ్యన్న


ఎస్‌.రాయవరం, మార్చి 3 : రాష్ట్రంలో రాక్షసుడే పాలన చేయడం వల్ల రాజ్యాంగానికి కూడా గౌరవం దక్కడం లేదని, ప్రపంచ చరిత్రలోనే ఏ నియంత ఇంత అరాచకపాలన సాగించలేదని టీడీపీ పాలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింకాలయన అయ్యన్నపాత్రుడు అన్నారు. పెదగుమ్ములూరులో మాజీ ఎంపీపీ ఏజర్ల వినోద్‌రాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పాలకులు పాల్పడుతున్న బెదిరింపులు, ప్రలోభాలకు భయపడనవసరం లేదని, తాము కార్యకర్తలకు అండగా ఉం టామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే సంప్రదా యం టీడీపీదన్నారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ పాలకులు కనబడుతున్నారని ఆరోపించారు. విశాఖ కేంద్రంగా విజయసాయిరెడ్డి అనేక భూ అక్రమాలకు తెరలేపారని, అటువంటి వారికి టీడీపీని విమర్శించే హక్కు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఒక్క సీసీ రోడ్డు కూడా నిర్మాణం జరగలేదన్నారు.  వైసీపీ అరాచకాలను భరించేలేక పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు ఇచ్చిన వారికే ప్రజలు పట్టం కట్టారని, వైసీపీ అక్రమాలు, బెదిరింపులకు పాల్పడకుండా అనూహ్యమైన ఫలితాలు వచ్చేవని అయ్యన్న పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఉపాధి హామీ పథకంలో భాగంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, ఆ నాటి ప్రజాప్రతినిధులకు రెండేళ్లయినా బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండల పరిషత్‌లను, జడ్పీటీసీ స్థానాల్లోనూ టీడీపీ గెలిచేలా నాయకులు, కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు లాలం కాశినాయుడు, నల్లపరాజు వెంకట్రాజు, పెదిరెడ్డి చిట్టిబాబు, కురందాసు నూకరాజు, పార్టీ సీనియర్‌ నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్‌, కొప్పిశెట్టి కొండబాబు, తుంపాల నాగేశ్వరరావు, మాతా గుర్నాఽథరావు, గుర్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-04T07:00:02+05:30 IST