Abn logo
Sep 19 2021 @ 00:55AM

రాష్ట్రంలో రాక్షస సంస్కృతి

పెదిరెడ్డి చిట్టిబాబుని అభినందిస్తున్న తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత


 ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే దౌర్జన్యాలు చేస్తారా?

 పాలకులు, వైసీపీ శ్రేణుల తీరు అత్యంత దారుణం

 తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత 

పాయకరావుపేట, సెప్టెం బరు 18 : వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎత్తిచూపుతూ.. శాంతియుతంగా ఆందోళనలు చేస్తు న్న ప్రతిపక్షాలపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తూ, రాక్షస సంస్కృతికి తెరలేపుతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.  శనివారం పాయకరావుపేట వచ్చిన ఆమె  విలేఖర్లతో  మాట్లాడుతూ ఇటీవల నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆధ్వర్యంలో ‘రైతుల కోసం తెలుగుదేశం’ కార్యక్రమం చేపట్టి, అధికారులకు వినతి పత్రం ఇచ్చేం దుకు పోలీసుల వలయంలో ర్యాలీ గా వెళ్లాల్సి వచ్చిందన్నారు. చంద్ర బాబు ఇంటిపై దాడి చేయడం అమానుషమని, అయన్యపాత్రుడి ఇల్లు ముట్టడికి ఎమ్మెల్యే యత్నిం చడం సరికాదన్నారు.  గతంలో టీడీపీ ప్రభుత్వం ఇదేవిధంగా ఆలో చించి ఉంటే  జగన్‌ రాష్ట్రంలో పాద యాత్ర చేసేవాడా అన్ని ప్రశించారు.  వైసీపీ పాలకులు  చేస్తున్న తప్పు లతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె తెలిపారు. 

మండల టీడీపీ అధ్యక్షుడిగా పెదిరెడ్డి చిట్టిబాబు ఎన్నిక 

 పాయకరావుపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాయక రావుపేట మండల టీడీపీ అధ్యక్షు డిగా పెదిరెడ్డి చిట్టిబాబు నాల్గవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  అనంతరం అనితతో పాటు పలు వురు  నాయకులు అతనిని అభినం దించారు. నాయకులు పెదిరెడ్డి శ్రీను, వంకా వెంకటరమణ, కంకి పాటి వెంకటేశ్వరరావు, చింతకా యల రాంబాబు, దాసరి అప్పారావు, పల్లా విలియంకేరి, చిక్కాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

టీడీపీవైపే ప్రజల చూపు

నక్కపల్లి: రానున్న రోజుల్లో టీడీపీని గెలిపించుకోవాలన్న ఆలోచ నతో అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని, టీడీపీ శ్రేణులు మరింత ఆత్మస్థైర్యంతో ప్రజా సమ స్యలపై పోరాడాలని వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఉపమాక సమీపం శీనయ్యపాలెం  సత్తెమ్మఆలయం వద్ద జరిగిన టీడీపీ మం డలస్థాయి సమావేశంలో మాట్లా డారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో పోల్చు కుంటే ఏ మాత్రం అభ్యంతరకరం కాదన్నారు. ఈ సందర్భంగా ఉపమాక, రేబాక, ఎన్‌.నర్సాపురం నుంచి కొందరు టీడీపీలో చేరారు.  జడ్పీటీసీ మాజీ సభ్యుడు కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి కొండబాబు, టీడీపీ నేతలు కొప్పిశెట్టి వెంకటేశ్‌, బుజ్జి, వెలగా శ్రీను, వైబోయిన రమణ, ప్రగడ వీరబాబు, గింజాల లక్ష్మణరావు,నానేపల్లి రాఘవులు పాల్గొన్నారు. 

మళ్లీ వెంకటేశ్‌కే టీడీపీ పగ్గాలు

నక్కపల్లి మం డలం టీడీపీ అధ్య క్షుడిగా పార్టీ సీనియర్‌ నాయకుడు కొప్పిశెట్టి వెంకటేశ్‌కే మళ్లీ అవ కాశం దక్కింది. గత కొనాళ్ల నుంచి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కురందాసు నూకరాజు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో శనివారం జరిగిన సమావేశంలో ఏకాభి ప్రాయంతో అంతా కొప్పిశెట్టి వెంకటేశ్‌ను ఎన్నుకున్నారు.