Abn logo
Sep 25 2021 @ 23:25PM

అనుమతి లేకుండా కడితే కూల్చుడే

అక్రమ నిర్మాణాలపై పటిష్ట నిఘా

వార్డుకో ఉద్యోగికి బాధ్యతలు

టాస్క్‌ఫోర్స్‌ కమిటీల పర్యవేక్షణ

మున్సిపాలిటీల్లో కోల్పోతున్న ఆదాయంపై దృష్టి

జగిత్యాల, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీల్లో అక్రమ నిర్మా ణాలు, అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై ప్రభు త్వం పటిష్ట నిఘాను పెడుతోంది. అనుమతి లేకుండా కడుతున్న భవ నాలకు చెక్‌ పెట్టడంతో పాటు ఆదాయానికి పడుతున్న గండిని నివా రించడానికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. క్షేత్ర స్థాయిలో నిరంతరం తనిఖీలు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించేందుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే మున్సిపాల్టీల్లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారు లతో పాటు టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయగా సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయంతో పూర్తి స్థాయిలో అక్రమ నిర్మా ణాలకు చెక్‌ పడనుంది. 


వార్డుకో ఉద్యోగికి బాధ్యత...

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో 134 వార్డులున్నాయి. ఇందు లో జగిత్యాల మున్సిపల్‌లో 48 వార్డులు, కోరుట్లలో 33 వార్డులు, మెట్‌ పల్లిలో 26 వార్డులు, ధర్మపురిలో 15 వార్డులు, రాయికల్‌లో 12 వార్డులు న్నాయి. కొత్త మున్సిపాల్టీ చట్టం ప్రకారం వార్డు కమిటీలతో పాటు వా ర్డులకు ప్రత్యేకాధికారులను ఇప్పటికే నియమించారు. దీంతో పాటు క్షేత్ర స్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించి అధికారులను నియమించడా నికి పట్టున్న ఉద్యోగుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఆయా వా ర్డుల్లో ప్రతీ నిత్యం క్షేత్ర స్థాయిలో విధుల్లో ఉండే పారిశుధ్య విభాగం శానిటరీ ఇన్స్‌పెక్టర్‌, జవాన్లు, వాటర్‌ సప్లై సూపర్‌ వైజర్లు, ఫిట్లర్లలో ప ట్టు ఉన్న ఉద్యోగులను వార్డు అధికారులుగా నియమించి బాధ్యతలను అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు ప్రాథమిక పరిశీలన జరుపుతున్నారు. 


జిల్లాలో 56 అక్రమ నిర్మాణాల గుర్తింపు...

జగిత్యాల జిల్లాలోని మూడు మున్సిపాల్టీల్లో ఇప్పటికే 56 అనుమతి లేని కట్టడాలను మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఉద్యోగులు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికను అందించారు. ఇందులో జగిత్యాల మున్సి పల్‌ పరిధిలో 38 అక్రమ కట్టడాలు, కోరుట్లలో 9, మెట్‌పల్లిలో 9 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అం దించారు. వీటిపై ఆయా మున్సిపల్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీ సుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుండడంతో మున్సిపాల్టీల ఆదాయం భారీగా పెరిగే అవకాశాలున్నాయని టౌన్‌ ప్లానింగ్‌ అధికారు లు పేర్కొంటున్నారు.


టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సహకారాలతో కూల్చివేతలే...

జిల్లాలో కొత్త మున్సిపాల్టీ చట్టం అమలులో భాగంగా భవన నిర్మా ణాలకు అనుమతులు సత్వరమే లభించేలా టీఎస్‌ బీపాస్‌ ఏర్పాటు చే సిన విషయం విదితమే. అనుమతులు మంజూరు, పర్యవేక్షణ, బాధ్య తలను పూర్తి స్థాయిలో పట్టణ ప్రణాళిక విభాగాలకే కాకుండా ప్రత్యేక బృందాలకు సర్కారు అప్పగించింది. ఆయా మున్సిపాల్టీల్లో ఆర్డీఓ, డీ ఎస్పీ, ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ, తహసీల్ధార్‌ అధికారులతో కూడిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు టీఎస్‌ బీ పాస్‌ ద్వారా మంజూరైన నిర్మాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. కమిటీల సభ్యులు తమ తమ సొంత శాఖల్లో గల విధులతోనే సతమతమవుతుండడంతో అదనపు బాధ్యతలను నిర్వర్తించేందుకు సమయాన్ని కేటాయించలేకపో తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మున్సిపాల్టీల్లోని ఉద్యోగులు, జవా న్లు, ఫిట్లర్లు, సూపర్‌వైజర్లు నిరంతరం క్షేత్ర స్థాయిలో నిర్మాణాలను గు ర్తించి రోజువారిగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలకు నివేదించడానికి అనుగుణం గా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌ కమిటీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ప్రతీ నెల ఈ కమిటీ సమావేశమై అనుమతిలేని, నిబంధనలకు విరుద్ధం గా జరిపిన నిర్మాణాలపై చర్చించి కూల్చివేతలు చేయాలని ఆయా ము న్సిపల్‌ కమిషనర్లను ఆదేశిస్తారు. దీంతో అక్రమ నిర్మాణాలను కూల్చివే సే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.  


ప్రభుత్వ నిర్ణయాలను పక్కాగా అమలు చేస్తాం

- బోగ శ్రావణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, జగిత్యాల

మున్సిపల్‌ పరిపాలనలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పక్కాగా అమలు చేస్తున్నాము. మున్సిపల్‌ ఆదాయానికి గండి పడకుండా పటిష్ట నిఘాను పెంచుతున్నాము. అక్రమాలను నివా రించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు సహకారాలను అంది స్తున్నాము. అక్రమ నిర్మాణాలతో మున్సిపాల్టీలు భారీగా ఆదాయం కో ల్పోతున్నాయి. ఈ వ్యవహారంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయము.