28న నోయిడా జంట టవర్ల కూల్చివేత

ABN , First Publish Date - 2022-08-13T08:56:41+05:30 IST

నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్ల కూల్చివేతకు ఈ నెల 28వ తేదీని గడువుగా నిర్ణయిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏవైనా

28న నోయిడా జంట టవర్ల కూల్చివేత

న్యూఢిల్లీ, ఆగస్టు 12: నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్ల కూల్చివేతకు ఈ నెల 28వ తేదీని గడువుగా నిర్ణయిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులు, వాతారణపరమైన సమస్యలు తలెత్తితే ఆ గడువును సెప్టెంబరు 4 వరకు పొడిగిస్తూ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎ.ఎ్‌స.బోపన్నల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. నోయిడాలో ఎమరాల్డ్‌ ప్రాజెక్టులో సూపర్‌టెక్‌ నిర్మించిన 40 అంతస్తుల టవర్లు నిబంధనలకు అనుగుణంగా లేవని గత ఏడాది ఆగస్టు 31న సుప్రీంకోర్టు తెలిపింది. వాటిని ఈ నెల 21లోగా కూల్చివేయాలని తొలుత ఆదేశించింది. అయితే నిపుణుల సలహా మేరకు ఆ గడువును ఈ నెల 28 వరకు పెంచింది. కూల్చివేత బాధ్యతలను ఎడిఫైస్‌ ఇంజినీరింగ్‌ సంస్థ చేపట్టనుంది. 

Updated Date - 2022-08-13T08:56:41+05:30 IST