Abn logo
Aug 3 2021 @ 22:40PM

ముత్తంగి జాతీయ రహదారిపై దుకాణాల కూల్చివేత

ఎక్స్‌కవేటర్లతో కూల్చివేతలు కొనసాగిస్తున్న దృశ్యం

తీవ్ర ఉద్రిక్తత  

భారీగా మోహరించిన పోలీసు బలగాలు 

పటాన్‌చెరు రూరల్‌, ఆగస్టు 3: ముత్తంగి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న దుకాణ సముదాయాలను మంగళవారం  డీఎల్పీవో సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కూల్చేశారు. దీంతో సంఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. పటాన్‌చెరు డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో పటాన్‌చెరు, బీడీఎల్‌, అమీన్‌పూర్‌, బొల్లారం, జిన్నారం సీఐలు వేణుగోపాల్‌రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్‌, లాలూనాయక్‌ భారీ పోలీసు బలగాలతో సంఘటనా స్థలంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరు ఎక్స్‌కవేటర్లతో దుకాణాలకు హుటాహుటిన తొలగించారు. అడ్డుతగిలిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముత్తంగి 528 సర్వే నంబరులో దుకాణాల సముదాయాలను మంజీర రోడ్డుకు ఆనుకుని జాతీయ రహదారి ప క్కన అక్రమంగా నిర్మించారంటూ హైకోర్టులో కేసు నమోదైంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఉత్తర్వు లు ఇచ్చినా పంచాయతీ యంత్రాంగం స్పందించలేదని కం టెంట్‌ వేయడంతో హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు  చర్యలు చేపట్టారు. కాగా తమ దుకాణాలపై కోర్టు స్టే ఉన్నా రాజకీయ ఒత్తిడితోనే అధికారులు కూల్చివేశారని పుణ్యవతి, యాదయ్య ఆధ్వర్యంలో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు పోయినా కూల్చివేతలను అడ్డుకుంటామని డీఎల్పీవో, డీఎస్పీలతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కూల్చివేతలను కొనసాగించారు.