అధికార పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూల్చివేత

ABN , First Publish Date - 2020-09-17T11:23:18+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా నాలాను ఆక్రమించి నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బుధవారం గ్రేటర్‌ వరంగల్‌

అధికార పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూల్చివేత

సహకరించిన ఎమ్మెల్యే అరూరి రమేష్‌


న్యూశాయంపేట, సెప్టెంబరు 16: నిబంధనలకు విరుద్ధంగా నాలాను ఆక్రమించి నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బుధవారం గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూల్చివేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ హంటర్‌రోడ్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ క్యాంపు కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, నాలాను ఆక్రమించి నిర్మించడంతో నాలా విస్తరణకు ఆటంకం ఏర్పడుతుండటంతో బల్దియా అధికారులు కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేశారు. యుద్ధప్రాతిపదికన నాలాల ఆక్రమణలను తొలగించాలని మంత్రి కేటీఆర్‌ ఇటీవల అధికారులను సూచించారు. ఇందులో భాగంగానే హంటర్‌రోడ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు.


కూల్చివేతకు సహకరించిన ఎమ్మెల్యే 

నాలా విస్తరణకు ఆటంకం ఏర్పడితే ఏ మాత్రం ఆలోచించకుండా తన కార్యాలయాన్ని కూల్చివేయాలని ఇటీవలే బల్దియా కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే తన క్యాంప్‌ కార్యాలయం భవనం కూల్చివేతకు సహకరించి ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు.

Updated Date - 2020-09-17T11:23:18+05:30 IST