హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): వరంగల్ శివార్లలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిమ్మాయి చెరువు ప్రాంతంలో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూల్చివేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అదే చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ప్లాట్లు చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్న అధికారులు.. పేదల గుడిసెలను మాత్రం తీసేయడమేంటని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.