కంగన ఇల్లు కూల్చివేత చట్టవిరుద్ధం

ABN , First Publish Date - 2020-11-28T07:51:00+05:30 IST

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె నివాసముంటున్న బంగళాను కూల్చివేయాలంటూ బృహన్ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ఇచ్చిన ఉత్తర్వు చట్టవిరుద్ధమని, ఒక దురుద్దేశంతో, పగతో ఇచ్చినట్లుగా కనిపిస్తోందని అంటూ హైకోర్టు దాన్ని కొట్టేసింది

కంగన ఇల్లు కూల్చివేత చట్టవిరుద్ధం

ముంబై కార్పొరేషన్‌కు హైకోర్టు చీవాట్లు


ముంబై, నవంబరు 27: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె నివాసముంటున్న బంగళాను కూల్చివేయాలంటూ బృహన్ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) ఇచ్చిన  ఉత్తర్వు చట్టవిరుద్ధమని, ఒక దురుద్దేశంతో, పగతో ఇచ్చినట్లుగా కనిపిస్తోందని అంటూ హైకోర్టు దాన్ని కొట్టేసింది. సెక్షన్‌ 354ఏ కింద ఇచ్చిన ఆ నోటీసు, తదనంతర కూల్చివేత చట్టపరమైన ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఇవి పిటిషనర్‌కు తీవ్రమైన బాధను, అసౌకర్యాన్ని కలిగించాయని హైకోర్టు పేర్కొంది. పౌరుల పట్ల ప్రభుత్వాలు చట్టవిరుద్ధమైన, వాస్తవ విరుద్ధమైన చర్యలకు దిగితే అది తీవ్రపరిణామాలకు దారితీస్తుందని జస్టిస్‌ ఎస్‌జే కథావాలా, జస్టిస్‌ రియా జ్‌ చాగ్లాలతో కూడిన బెంచ్‌ హెచ్చరించింది. ఆమెకు కార్పొరేషన్‌ నష్టపరిహారం ఇవ్వాలని చెబుతూ ఎంత ఇవ్వాలన్నది అంచనావేసేందుకు ఓ సర్వేయర్‌ను నియమించింది. మార్చి 21లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

Updated Date - 2020-11-28T07:51:00+05:30 IST