అసైన్డ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ల కూల్చివేత

ABN , First Publish Date - 2022-05-28T06:47:07+05:30 IST

అసైన్డ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను రెవె న్యూ అధికారులు కూల్చివేశారు.

అసైన్డ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్ల కూల్చివేత
అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు

మిర్యాలగూడ, మే 27: అసైన్డ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను రెవె న్యూ అధికారులు కూల్చివేశారు. శుక్రవారం తెల్లవారుజామున స్థానిక తాళ్లగడ్డలోని 60 సర్వే నెంబర్‌ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న ఐదు ఇళ్లను పోలీసు పహారాలో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మల్లెతోటగా పిలువబడే తాళ్లగడ్డ అసైన్డ భూమిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు ఫిర్యాదు అందడంతో సదరు ఇళ్ల యజమానులకు గతంలో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయినా నిర్మాణాలకు పూనుకోవడంతో ఆర్డీవో ఆదేశాల మేరకు తెల్లవారుజామున ఎక్స్‌కవేటర్‌లతో ఇళ్లను కూల్చివేశామని తహసీల్దార్‌ గణేష్‌ తెలిపారు. అసైన్డ భూమలను అమ్మడం, కొనడం నిషేధమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట ఆర్‌ఐలు సత్యనారాయణ, శ్యామ్‌కుమార్‌ వీఆర్వోలు నజీర్‌, మల్లేష్‌ వున్నారు.

Updated Date - 2022-05-28T06:47:07+05:30 IST