ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-07-06T04:46:24+05:30 IST

శంషాబాద్‌ మున్సిపాలిటీలోని కొత్వాల్‌గూడ సమీపంలోని

ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాల కూల్చివేత
ప్రభుత్వ భూమిలో కూల్చివేసిన కట్టడం

శంషాబాద్‌,జూలై 5 : శంషాబాద్‌ మున్సిపాలిటీలోని కొత్వాల్‌గూడ సమీపంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన కట్టడాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. కొత్వాల్‌గూడ సమీపంలోని 54 సర్వేనెంబర్‌లో కొందరు అనుమతిలేకుండా నిర్మాణం చేపట్టారు. ఈ విషయం తెలిసిన అధికారులు ఆ నిర్మాణాన్ని కూల్చివేయించారు. నిబంధనలు అతిక్రమించి మళ్లీ నిర్మాణం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 



Updated Date - 2022-07-06T04:46:24+05:30 IST