అక్రమ నిర్మాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-05-11T05:28:47+05:30 IST

పట్టణంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌ కూల్చివేయించారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఎల్లారెడ్డి, మే 10: పట్టణంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను మంగళవారం మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌ కూల్చివేయించారు. మున్సిపల్‌ పరిధిలో నిర్మించే ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని మున్సిపల్‌ అనుమతులు తీసుకున్న తర్వాతనే ఇంటి నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడితే మున్సిపల్‌చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో టీపీఎస్‌ వినిత్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Read more