పునరావాసం కల్పించిన తరువాతే కూల్చాలి

ABN , First Publish Date - 2021-06-15T05:23:41+05:30 IST

బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లు కూల్చాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

పునరావాసం కల్పించిన తరువాతే కూల్చాలి
ఇళ్లు కూల్చడాన్ని అడ్డుకుంటున్న అఖిలపక్ష నాయకులు

ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్న అఖిలపక్ష నాయకుల అరెస్టు

కడప (రవీంద్రనగర్‌), జూన్‌ 14: బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ఇళ్లు కూల్చాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం రవీంద్రనగర్‌, మక్కామసీదు ఎదురు పక్క సందులో బుగ్గవంక పరీవాహక ప్రాంతంలో ఇంటిని కూల్చివేత ను బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ, కాంగ్రెస్‌ నేత సత్తార్‌, సీపీఎం నగర నా యకుడు ఓబులేసు, ఆర్‌సీపీ నగర కార్యద ర్శి మగ్బుల్‌బాషా, మైనార్టీ రైట్స్‌ ఫోరం నే తలు దస్తగిరి మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఉన్నపళంగా రాత్రుళ్లు కరెంటు కట్‌ చేసి జేసీబీలతో నిర్ధాక్షిణ్యంగా ఇళ్లు కూ ల్చ డం అన్యాయమన్నారు. కరోనా కాలంలో ఏ మాత్రం పేద ప్రజల పట్ల కనికరం చూపకుండా ఉన్న ఇళ్లకు రాత్రుళ్లు కరెంట్‌ కట్‌ చేయడం దుర్మార్గమన్నారు. కొండల్లో గు ట్టల్లో ఇళ్లస్థలాలు ఇస్తాం, మీరు కట్టుకోండ ని చెబుతున్నారన్నారు. ముందస్తు నోటీసు లు ఇవ్వకుండా, సమయం కూడా ఇవ్వకుం డా కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు పుచ్చుకుని ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేసే చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. వెంటనే బుగ్గవంక నిర్వాసితులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళన చే స్తున్న 8 మందిని తాలుకా  పోలీసులు అరె స్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సుబ్బరాయు డు, భాగ్యలక్ష్మి, మైనుద్దీన్‌, జగదీష్‌, ఆదిత్య, లింగన్న, మునెయ్య, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T05:23:41+05:30 IST