Advertisement
Advertisement
Abn logo
Advertisement

నర్సీపట్నంలో ముగిసిన జనాగ్రహ దీక్షలు


నర్సీపట్నం, అక్టోబరు 22 :  టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ రెండు రోజుల చేపట్టిన ప్రజాగ్రహ దీక్ష శుక్రవారం సాయత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అలజడులు సృష్టించి, శాంతి భద్రతలకు విఘాతం కలి గించేందుకే పట్టాభితో చంద్రబాబునాయుడు సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని విమర్శించారు.  జడ్పీటీసీలు సుర్ల గిరిబాబు, పెట్ల సత్యవేణి, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, గజ్జలపు మణికుమారి, సాగిన లక్ష్మణమూర్తిలతో పలువురు సర్పంచ్‌లు, నాయకులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, సీహెచ్‌.సన్యాసిపాత్రుడు, మళ్ల గణేశ్‌ తదిరులు సంఘీభావం తెలిపారు.

Advertisement
Advertisement