అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కొనసాగుతున్న జో బైడెన్ హవా!

ABN , First Publish Date - 2020-11-01T01:59:00+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి,

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కొనసాగుతున్న జో బైడెన్ హవా!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ పత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఈ క్రమంలో అమెరికన్ ఓటర్లు ఎవరి పక్షాన ఉన్నారనే విషయాన్ని తాజాగా విడుదలైన సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఎన్నికల రేసులో జో బైడెన్.. జాతీయ స్థాయిలో 8 పాయింట్ల తేడాతో ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. ఎన్నికల నేపథ్యంలో ‘ది ఫాక్స్ న్యూస్’ ఓటర్ల నాడి తెలుసుకునేందుకు సర్వే నిర్వహించి శుక్రవారం రోజు ఫలితాలను విడుదల చేసింది. ‘ది ఫాక్స్ న్యూస్’ విడుదల చేసిన సర్వే ఫలితాల ప్రకారం.. 52శాతం మంది ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు తెలిపారు. 44 శాతం మంది నవంబర్ 3న ట్రంప్‌కు ఓటేయనున్నట్లు చెప్పారు. 2 శాతం మంది ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పాగా.. మరో రెండు శాతం మంది మూడో అభ్యర్థికి ఓటేయనున్నట్లు తెలిపారు.



 జాతీయ స్థాయిలోనే కాకుండా అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే ముఖ్యమైన రాష్ట్రాల్లో సైతం జో బైడెన్ హవా కొనసాగుతోందని ‘ది ఫాక్స్ న్యూస్’ సర్వే ఫలితాల్లో వెల్లడైంది. బుధవారం రోజు విడుదలైన సీఎన్ఎన్ సర్వే ఫలితాల్లో కూడా ఎన్నికల రేసులో ట్రంప్ వెనడబడ్డట్టు వెల్లడైంది. సీఎన్ఎన్ సర్వే ఫలితాల ప్రకారం.. రిజిస్టర్ చేసుకున్న ఓటర్లలో 54 శాతం మంది జో బైడెన్‌కు మద్దతు తెలుపగా.. 42శాతం మంది ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేయనున్నట్లు చెప్పారు. కాగా.. ఎన్నికల ముంగిట వెల్లడైన సర్వే ఫలితాల్లో కూడా బైడెన్ హవా కొనసాగడంతో రిపబ్లికన్ పార్టీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. 


Updated Date - 2020-11-01T01:59:00+05:30 IST