డీమార్ట్‌ లాభం రూ.427 కోట్లు

ABN , First Publish Date - 2022-05-15T07:56:08+05:30 IST

డీమార్ట్‌ బ్రాండ్‌తో రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో..

డీమార్ట్‌ లాభం రూ.427 కోట్లు

న్యూఢిల్లీ: డీమార్ట్‌ బ్రాండ్‌తో రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.426.75 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.413.87 కోట్లు)తో పోల్చితే లాభం స్వల్పంగా 3.11 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 18.55 శాతం వృద్ధితో రూ.7,411.68 కోట్ల నుంచి రూ.8,786.45 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ.8,210.13 కోట్లుగా ఉన్నాయి.

Updated Date - 2022-05-15T07:56:08+05:30 IST