డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ABN , First Publish Date - 2020-05-30T10:52:31+05:30 IST

జిల్లాలోని టాటామేజిక్‌ వాహన డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అమర్‌భవన్‌లో మాట్లాడుతూ..

డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

విజయనగరం దాసన్నపేట: జిల్లాలోని టాటామేజిక్‌ వాహన డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అమర్‌భవన్‌లో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 200 టాటా మేజిక్‌ వాహనాలపై ఆధార పడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో  డ్రైవర్లు  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ప్రస్తుతం నిబంధనలు సడలిం చడంతో రోడ్లపైకి వస్తున్న డ్రైవర్లకు ఆర్టీవో అధికారులు త్రైమాసిక పన్ను  చెల్లిం చాలని  ఒత్తిడి తేవడం సరికాదన్నారు.  దీనిపై ప్రభుత్వం స్పం దించి  పన్నులు రద్దు చేయాలని కోరారు. వెంకటేశ్వర జీపు టాటామేజిక్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఈశ్వరరావు, సత్యనారాయణ, జానకిరావు, చిన్న, శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T10:52:31+05:30 IST