విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2022-08-09T04:24:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సవరణ చట్టం 2022 రద్దుచేయాలని తెలం గాణ స్టేట్‌పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో సోమవా రం జిల్లాకేంద్రంలోని సర్కిల్‌కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా
సర్కిల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సవరణ చట్టం 2022 రద్దుచేయాలని తెలం గాణ స్టేట్‌పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో సోమవా రం జిల్లాకేంద్రంలోని సర్కిల్‌కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు పరంచేసి బడాబాబులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ చట్టం అమలైతే ఉద్యోగులకు, వినియోగదారులకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. జేఏసీ చైర్మన్‌ విలాస్‌, కన్వీనర్‌ వాసుదేవ్‌, కోకన్వీనర్లు ఏమాజీ, సతీష్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T04:24:53+05:30 IST