ఆ టైటిల్‌కు రెండు కోట్లు డిమాండ్ ?

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్‌లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాతో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకుడిగానూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. హిందీ నేటివిటీకి అనుగుణంగా స్వల్ప మార్పులతో స్ర్కిప్ట్ ను తీర్చిదిద్దారు వినాయక్. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ సినిమాకి గ్రాండ్ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయం చిత్ర బృందానికి సమస్యగా మారింది. నిజానికి ముందుగా ఈ మూవీకి ‘ఛత్రపతి’ టైటిల్‌నే ఖాయం చేశారు. అయితే అదే టైటిల్ ను వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవడంతో ‘శివాజీ’ టైటిల్ అయినా పెడదాం అనుకున్నారు. ఆ టైటిల్ ను కూడా వేరే వాళ్లు రిజిస్టర్ చేయించడంతో సమస్య మొదలైంది.


ప్రస్తుతం వినాయక్ ‘ఛత్రపతి’ టైటిల్ గురించి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఆ టైటిల్ కి.. రూ. 2కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఈ సినిమాకి ‘ఛత్రపతి’ టైటిల్ తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో.. వినాయక్ అండ్ టీమ్ ఆలోచనలో పడ్డారట. మరి  రెండు కోట్లిచ్చి ‘ఛత్రపతి’ టైటిల్ ను దక్కించుకుంటారా లేక వేరే టైటిల్ ఖాయం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. 

Advertisement

Bollywoodమరిన్ని...