గృహ రుణాలకు గిరాకీ అదుర్స్‌

ABN , First Publish Date - 2021-10-18T07:31:18+05:30 IST

కొవిడ్‌ సద్ద్దుమణిగింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. ప్రజలు కూడా సొంత గూటి కోసం వేట ప్రారంభించారు. దీంతో...

గృహ రుణాలకు గిరాకీ అదుర్స్‌

కలిసొస్తున్న తక్కువ వడ్డీ రేట్లు

న్యూఢిల్లీ: కొవిడ్‌ సద్ద్దుమణిగింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. ప్రజలు కూడా సొంత గూటి కోసం వేట ప్రారంభించారు. దీంతో గృహ రుణాలకు డిమాం డ్‌ పెరిగింది. పండగల సీజన్‌ కూడా తోడవడంతో బ్యాంకులు, గృహ ఫైనాన్స్‌ కంపెనీ (హెచ్‌ఎ్‌ఫసీ)లు వడ్డీ రేట్లు తగ్గించాయి. కొన్ని బ్యాంకులైతే డిసెంబరు వరకు ప్రాసిసింగ్‌ ఫీజులూ రద్దు చేశాయి. దీంతో గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో గృహ రుణాల పంపిణీ 9.2 శాతం పెరిగాయి. 


కనీస వడ్డీ 6.5 శాతమే: క్రెడిడ్‌ స్కోరు బాగుంటే 6.5 శాతం వడ్డీకే గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీలు ఎగబడుతున్నాయి. మన దేశంలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు గతంలో ఎన్నడూ ఇంత కనిష్ఠ స్థాయిలో లేవు. ఇవన్నీ దేశంలో గృహాలతో పాటు గృహ రుణాలకూ గిరాకీ పెంచుతున్నాయి. వీటికి తోడు మరిన్ని అంశాలు హోమ్‌ లోన్స్‌కు డిమాండ్‌ పెంచుతున్నాయి. అవేమిటంటే..

  1. గత రెండేళ్లుగా స్థిరంగా ఉన్న గృహాల ధరలు
  2. క్రమంగా పుంజుకుంటున్న జాబ్‌ మార్కెట్‌ 
  3. అందుబాటు ధరల్లోనే ఇళ్ల ధరలు
  4. డిమాండ్‌కు మించి అందుబాటులో ఉన్న నివాస గృహాలు
  5. వర్క్‌ ఫ్రం హోమ్‌తో పెద్ద ఇళ్లకు పెరిగిన గిరాకీ
  6. వ్యాక్సినేషన్‌తో కొవిడ్‌పై తగ్గిన భయాలు
  7.  పండగల సీజన్‌తో రెడీ టు మూవ్‌ ఇళ్లకు 
  8. మరింతగా పెరిగిన  గిరాకీ
  9. జీతాల పెరుగుదలతో పెరుగుతున్న సొంతింటి కల.
  10. కార్పొరేట్‌ రుణాలకు గిరాకీ లేకపోవడంతో గృహ రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బ్యాంకులు


పండగల సీజన్‌ తర్వాత కూడా ఇళ్లకు డిమాండ్‌ తగ్గదు. ముఖ్యంగా వెంటనే గృహ ప్రవేశం చేసేందుకు వీలుగా ఉండే అందుబాటు ధరల గృహాలకు మరింత డిమాండ్‌ ఉంటుంది.

- వై విశ్వనాథ గౌడ, ఎండీ,

 ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Updated Date - 2021-10-18T07:31:18+05:30 IST