హోటళ్లు.. లాడ్జీలు ఫుల్‌

ABN , First Publish Date - 2021-10-26T08:43:01+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అద్దె ఇళ్లు, లాడ్జీలు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, కళాశాలలు, పాఠశాలలు, రైస్‌ మిల్లులకు డిమాండ్‌ పెరిగిపోయింది. ఉప ఎన్నిక తేదీ సమీపించడంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు తమ నాయకులు

హోటళ్లు.. లాడ్జీలు ఫుల్‌

  • అద్దె ఇళ్లు, ఫంక్షన్‌ హాళ్లకూ డిమాండ్‌..
  • హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో కోలాహలం
  • భారీగా చేరిన పార్టీల శ్రేణులు
  • కరీంనగర్‌, వరంగల్‌లోనూ రూములు బుక్‌
  • గదుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్‌
  • వరంగల్‌ నుంచే ఆర్థిక లావాదేవీలు..?


హుజూరాబాద్‌/హనుమకొండ క్రైం, అక్టోబరు 24: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అద్దె ఇళ్లు, లాడ్జీలు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, కళాశాలలు, పాఠశాలలు, రైస్‌ మిల్లులకు డిమాండ్‌ పెరిగిపోయింది. ఉప ఎన్నిక తేదీ సమీపించడంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు తమ నాయకులు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో నియోజకవర్గానికి తరలించాయు. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివస్తుండడంతో వారికి బస కల్పించడం స్థానిక నేతలకు కష్టం గా మారింది. కొన్ని రోజులుగా  టూ లెట్‌ బోర్డు ఉన్న ఇళ్లు, షట్టర్‌ కనిపిస్తే చాలు వెంటనే బుక్‌ అయిపోతున్నాయి. ప్రధాన పార్టీలు తమ కార్యాలయాల భవనాలను నేతలు, కార్యకర్తలకు బస.. సమావేశాలకు వినియోగించుకుంటున్నాయి. కొత్త ఇళ్లు, నిర్మాణంలో ఉన్న భవనాలు, ఖాళీగా ఉన్న అద్దె ఇళ్లకు కూడా గిరాకీ ఏర్పడింది. ఇప్పటికే హుజూరాబాద్‌, జమ్మికుంటలోని లాడ్జీలు, ఫంక్షన్‌ హాళ్లను ఆయా పార్టీలు బుక్‌ చేసుకున్నాయి. రైస్‌ మిల్లుల్లో స్థలం ఎక్కువగా ఉంటుందని వాటిని కూడా అద్దెకు తీసుకున్నారు. హుజూరాబాద్‌, జమ్మికుంటలో బస దొరకడం కష్టంగా మారడంతో కరీంనగర్‌లోని లాడ్జీలు, స్టార్‌ హోటళ్లన్నీ బుక్‌ అయ్యా యి. దీంతో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. 


నిర్వాహకులకు తలనొప్పి..

వరంగల్‌ ట్రై సిటీ్‌సలో కొన్ని లాడ్జీల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పరిమితికి మించి ఉంటున్నా రు. ఇద్దరు నిద్రించే గదిలో నలుగురు, ఐదుగురు ఉం టుండడంతో నిర్వాహకులు ఎవరినీ ఏమనలేని పరిస్థితి ఉంది.  రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా మద్యం, ఆ హారం ఆర్డర్‌ చేస్తుండడంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఫుల్లుగా మద్యం తాగిన తర్వా త సర్వీస్‌ బాయ్‌లతో గొడవలకు దిగుతున్నారు. 


పోలీసుల పర్యవేక్షణ ఏది..?

చాలా రోజులుగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సంబంధించిన కార్యకలాపాలు వరంగల్‌, హనుమకొం డ నుంచే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు వరంగల్‌ ట్రై సిటీ్‌సలో కొత్త వ్యక్తులు, లాడ్జీలు, హాస్టళ్లు, ఫంక్షన్‌హాళ్లపై పోలీసులు దృష్టిసారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హనుమకొండ, హుజూరాబాద్‌ మ ధ్య చెక్‌పోస్టులు లేకపోవడం వల్ల ఇప్పటికే ప్రజలను ప్రలోభపెట్టేందుకు కావలసిన నగదు చేరిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదంతా పోలీసులకు తెలిసే జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


వరంగల్‌లో కిక్కిరిసిన లాడ్జీలు..

హుజూరాబాద్‌ ప్రాంతం వరంగల్‌కు దగ్గరగా ఉండటంతో అక్కడ సందడి నెలకొంది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలో ఉన్న లాడ్జీలు ఎన్నడూలేని విధంగా కిక్కిరిసిపోతున్నాయి. వరంగల్‌లో ఉన్న చిన్నపాటి లాడ్జీల నిర్వాహకులకు సైతం మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్‌చేసి గదులు ఇవ్వాలని, డబ్బులు ఎంతైనా ఇస్తామని చెప్పడంతో ఇవ్వక తప్పడం లేదు. కొందరు ప్రైవేటు హాస్టళ్లు, ఫంక్షన్‌హాళ్లు, అపార్ట్‌మెంట్లలో ఆతిథ్యం ఇస్తున్నారు. వరంగల్‌ ట్రై సిటీ్‌సలో సుమారు 142 లా డ్జీలు ఉన్నాయి. అందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కిందిస్థాయి ప్రజాప్రతినిధి నుం చి ఎమ్మెల్యేల వరకు బస చేస్తున్నారు. వారం రోజులుగా ఏసీ, నాన్‌ ఏసీ గ దులు పూర్తిగా నిండిపోయాయని లాడ్జీ ల నిర్వాహకులు వెల్లడించారు. ప్రధానంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు వరంగల్‌లో విడిది చేస్తున్నారు. ఎన్నికల అధికారులకు అనుమానం రాకుండా ఉం డేందుకు వరంగల్‌ నుంచే ఎన్నికలకు సంబంధించినఆర్థిక లావాదేవీలు చేస్తున్నట్టు తెలిసింది.  లాడ్జీల్లో మద్యం తాగుతున్న వారితో జాతర వాతావరణం కనిపిస్తోంది. 

Updated Date - 2021-10-26T08:43:01+05:30 IST